షూటింగ్ పూర్తి కాకుండా ఓటిటి రిలీజ్ ఏంటయ్యా?
ఇప్పుడు సినిమా షూటింగ్స్ పూర్తయిన సినిమాల్ని ఓటిటి లో విడుదల కాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు చిన్న సినిమాల్తో సరిపెట్టుకున్న ఓటిటి సంస్థలు [more]
ఇప్పుడు సినిమా షూటింగ్స్ పూర్తయిన సినిమాల్ని ఓటిటి లో విడుదల కాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు చిన్న సినిమాల్తో సరిపెట్టుకున్న ఓటిటి సంస్థలు [more]
ఇప్పుడు సినిమా షూటింగ్స్ పూర్తయిన సినిమాల్ని ఓటిటి లో విడుదల కాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు చిన్న సినిమాల్తో సరిపెట్టుకున్న ఓటిటి సంస్థలు ఇప్పుడు క్రేజ్ ఉన్న సినిమాల్తో దూసుకుపోవాలని చూడడమే కాదు…. ఇప్పటికే రామ్ రెడ్ కి, నాని వి కి, అనుష్క నిశ్శబ్దానికి వల వేశారు. కానీ హీరోలు ఓటిటీల వలలో పడడంలేదు. అయితే తాజాగా రవితేజ – గోపీచంద్ ల కాంబోలో తెరకెక్కుతున్న క్రాక్ సినిమా నేరుగా ఓటిటి విడుదల అని.. ఇప్పటికే క్రాక్ నిర్మాత పేరున్న ఓటిటి సంస్థలతో డీల్ మాట్లాడుతుందని టాక్ గత రెండు రోజులుగా మార్మోగిపోతోంది.
అయితే ఇప్పుడు మూవీ టీం మాత్రం ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. అప్పుడే ఓటిటిలో ఎలా విడుదలవుతుంది అంటూ అవాక్కవుతున్నారు. ఇంకా పది రోజుల షూటింగ్ తో పాటుగా మూడు పాటల చిత్రీకరణ మిగిలే ఉంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కావాలి. అప్పుడే ఓటిటి కీ ఎలా సాధ్యం అంటున్నారు. పోనీ ఇప్పుడు షూటింగ్ చేద్దామన్నా కరోనా కారణంగా సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి అలాంటిది క్రాక్ సినిమా ఓటిటిలో ఎలా విడుదలవుతుంది అని అంటున్నారు. సినిమా మొత్తం పూర్తయ్యి థియేటర్స్ లో విడుదలకు వేచి చూస్తున్న సినిమాలకే ఓటిటి లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది… కానీ క్రాక్ మాత్రం ఇప్పుడప్పుడే విడుదల కాదని క్రాక్ యూనిట్ తేల్చేసింది.