నటి డింపుల్ హయతిపై క్రిమినల్ కేసు.. అసలేం జరిగిందంటే

ఈ ఘటనపై రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆమెపై పోలీసులు సెక్షన్ ..

Update: 2023-05-23 05:29 GMT

dimple hayathi

సినిమా హీరోయిన్.. ఐటమ్ సాంగ్స్ చేస్తున్న నటి డింపుల్ హయతిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అందుకు కారణం ఆమె ఓ ఐపీఎస్ అధికారి కారును ఢీ కొట్టడం. వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డె కారును డింపుల్ హయతి తన కారుతో ఢీ కొట్టింది. ఆ తర్వాత హంగామా చేస్తూ.. అదే వాహనాన్ని కాలితో తన్నింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని ఎస్కేఆర్ అపార్ట్ మెంట్స్ లో జరిగింది. డింపుల్ హయతి, రాహుల్ హెగ్డే ఆ అపార్ట్ మెంట్స్ లోనే ఉంటున్నారు. రాహుల్ ప్రస్తుతం ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్నారు.

ఈ ఘటనపై రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆమెపై పోలీసులు సెక్షన్ 341,279,353 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ వాహనాన్ని కావాలని కాలితో తన్నడం అంటే ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడమే. ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేయడం, ప్రభుత్వ అధికారిని దుర్భాషలాడటం వంటి అభియోగాలను డింపుల్ హయతిపై మోపారు. విచారణకు పోలీస్ స్టేషన్ కు రావాలంటూ ఆమెకు సమన్లు జారీ చేశారు. ఈ ఘటనపై రాహుల్ మాట్లాడుతూ.. డింపుల్ ప్రవర్తన మొదటి నుంచి ఇలాగే ఉందని, ఎన్నిసార్లు నచ్చచెప్పినా ఆమె పద్ధతి మార్చుకోవడం లేదని అన్నారు. తాజాగా ఈ అంశంపై డింపుల్ ట్వీట్ చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన తప్పుని కప్పిపుచ్చుకోలేరంటూ ట్వీట్ లో పేర్కొంది.


Tags:    

Similar News