చంద్రబాబు అరెస్టుపై సినీ పరిశ్రమ ఎందుకు స్పందించదో చెప్పిన సురేష్ బాబు
చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి పలువురు ప్రముఖులు స్పందిస్తూ;
చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి పలువురు ప్రముఖులు స్పందిస్తూ వస్తున్నారు. అయితే చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్ద పెద్ద వాళ్లు స్పందించడం లేదని ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు. కొందరు స్పందించినా వారికి టీడీపీతోనూ, చంద్రబాబు నాయుడు తోనూ అనుబంధం ఉన్న వాళ్లే..! తాజాగా ఈ విషయంపై సినీ నిర్మాత సురేష్ బాబు స్పందించారు.
“సప్త సాగరాలు దాటి” సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో దగ్గుబాటి సురేష్ బాబుకు ఈ విషయమై ఓ ప్రశ్న ఎదురైంది. ఫిల్మ్ ఇండస్ట్రీ చంద్రబాబు అరెస్ట్ పై ఎందుకు మౌనంగా ఉంది అని ఒక రిపోర్టర్ అడిగారు. దీనిపై సురేష్ బాబు స్పందించారు. “తెలుగు సినీ పరిశ్రమ రాజకీయాలకు, మతపరమైన అంశాలకు ఎప్పుడూ దూరంగానే ఉంది. అందుకే సెన్సిటివ్ విషయాలపై చిత్ర పరిశ్రమ నుంచి స్పందన ఉండదు. తెలంగాణ, ఆంధ్ర విషయంలోనూ సినీ పరిశ్రమ స్పందించలేదు” అంటూ సమాధానం ఇచ్చారు.