మెగా ఇంట పండుగ.. ఆ పిల్లలు, మహిళలు ఎవరో తెలుసా..?

మెగా ఇంట దసరా, బతుకమ్మ వేడుక. ఆ సెలబ్రేషన్స్ లో కనిపించిన పిల్లలు, మహిళలు ఎవరో తెలుసా..?

Update: 2023-10-24 05:32 GMT

మెగా ఇంట వారసురాలు అడుగుపెట్టిన తరువాత కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రతి పండగని వారసురాలితో ఘనంగా జరుపుకుంటున్నారు. రామ్ చరణ్, ఉపాసన ముద్దుల కూతురు క్లీంకార.. నాయనమ్మ-తాతయ్యలతో కలిసి దసరా, బతుకమ్మ పండుగని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోని ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఆ వీడియోలో చిరంజీవి-సురేఖ దంపతులు, చిరంజీవి తల్లి అంజనాదేవి, రామ్ చరణ్ దంపతులు, సాయి ధరమ్ తేజ్, అలాగే చిరంజీవి కూతుళ్లు, మనవరాళ్లు, మెగా కుటుంబసభ్యులు కనిపించారు. ఈ వీడియోలో వీరితో పాటు కొంతమంది పిల్లలు, మహిళలు కూడా కనిపించారు. ఇంతకీ వారంతా ఎవరు అనేది తెలుసా..?
ఆ పిల్లలు, మహిళలు అంతా 'బాలిక నిలయం సేవా సమాజ్' ట్రస్ట్ కి చెందినవారు. వారంతా ఎవరు లేని ఆనాధలు. ఈ ట్రస్ట్ ని ఉపాసన వాళ్ళ అమ్మమ్మ స్థాపించారు. ఆవిడ ఉన్నంత కాలం బాలిక నిలయంలోని అందరి బాగోగులు దగ్గర ఉండి చూసుకునేవారు. ప్రస్తుతం ఆ బాధ్యత ఉపాసన తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ శక్తి పండుగను.. ఆ మహిళలతో కలిసి చేసుకోవాలని ఉపాసన భావించారు.
అందుకనే మెగా ఇంటకి వారిని ఆహ్వానించి, వారితో బతుకమ్మ ఆడి, మహాశక్తికి ప్రార్ధనలు చేశారు. ఇక పండుగ వేళ మెగా ఇంటికి వచ్చిన వారందరికీ నూతన వస్త్రాలను అందజేశారు. అలాగే రకరకాల భోజనాలతో విందు కూడా ఏర్పాటు చేసారు. ఈ మొత్తం వేడుకను ఒక వీడియోగా ఉపాసన పోస్టు చేస్తూ.. బాలిక నిలయం సేవా సమాజ్ తో పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.


Tags:    

Similar News