డే 1 కన్నా డే 4 అదిరినయ్!

అల్లరి నరేష్ – విజయ్ కనకమేడల కాంబోలో తెరకెక్కిన నాంది సినిమా గత శుక్రవారం విడుదలైంది. అయితే రిలీజ్ అయిన రోజు కాస్త వీక్ గా స్టార్ట్ [more]

Update: 2021-02-23 16:45 GMT

అల్లరి నరేష్ – విజయ్ కనకమేడల కాంబోలో తెరకెక్కిన నాంది సినిమా గత శుక్రవారం విడుదలైంది. అయితే రిలీజ్ అయిన రోజు కాస్త వీక్ గా స్టార్ట్ అయిన నాంది కలెక్షన్స్.. డే 4 కి వచ్చేసరికి మరింతగా పెరిగాయి. మౌత్ టాక్ ఎంత పవర్ ఫుల్ అనేది ఇంకోసారి ప్రూవ్ చేసిన సినిమా నాంది. సినిమాలో దమ్ముంటే ఎన్ని సినిమాల మధ్య రిలీజ్ అయినా.. చివరికి దమ్మున్న సినిమానే నిలబడుతుంది.. దుమ్ము రేపుతోంది అనేది మళ్ళీ ప్రూవ్ చేసిన మంచి సినిమా అల్లరి నరేష్ నాంది. ఫస్ట్ డే కలెక్షన్స్ కన్నా డే 4 అంటే నాలుగో రోజు అది వీక్ డే అయిన సోమవారం ఎక్కువ రెవిన్యూ రావడమే దీనికి నిదర్శనం.  
థియేట్రికల్ రిలీజ్ కి 2.5 కోట్లు బ్రేక్ ఈవెన్ అనుకుంటే.. దాన్ని క్రాస్ చేసి లాభాల బాటలోకి నాంది పలికాడు అల్లరి నరేష్. నిజానికి ఈ క్రెడిట్ లో అల్లరి నరేష్ నటనకు సగం దక్కితే.. ఇంతమంచి సినిమాని అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న ప్రేక్షకులకి కూడా సగం క్రెడిట్ ఇవ్వాలి. ప్రాఫిట్స్ కి నాంది పలికిన ప్రేక్షకులు నాంది సినిమాని మున్ముందు ఇంకే రేంజ్ కి తీసుకెళతారో చూద్దాం. ఏదేమైనా ఓ మంచి సినిమాకి దక్కిన మంచి విజయం ఇది. మరిన్ని మంచి సినిమా కథలకు ఉత్సాహాన్ని ఇచ్చే ప్రోత్సాహం ఇది.
నాంది ఆంధ్ర అండ్ తెలంగాణా డే వైజ్ కలెక్షన్స్
డే 1 – 45 లక్షలు 
డే 2 – 65 లక్షలు 
డే 3 – 1.04 కోట్లు 
డే 4 – 46 లక్షలు
టోటల్: 2.60 కోట్లు 

Tags:    

Similar News