విడాకుల తర్వాత డిప్రెషన్!!
చాలామంది హీరోయిన్స్ ప్రేమలో ఫెయిల్ అయినా, కెరీర్ లో ఎత్తుపల్లాలున్నా, అలాగే పెళ్లి తర్వాత విడాకులు తీసుకున్నా వెంటనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. మానసిక ఒత్తిడితో మెంటల్ [more]
చాలామంది హీరోయిన్స్ ప్రేమలో ఫెయిల్ అయినా, కెరీర్ లో ఎత్తుపల్లాలున్నా, అలాగే పెళ్లి తర్వాత విడాకులు తీసుకున్నా వెంటనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. మానసిక ఒత్తిడితో మెంటల్ [more]
చాలామంది హీరోయిన్స్ ప్రేమలో ఫెయిల్ అయినా, కెరీర్ లో ఎత్తుపల్లాలున్నా, అలాగే పెళ్లి తర్వాత విడాకులు తీసుకున్నా వెంటనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. మానసిక ఒత్తిడితో మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు. ఆ డిప్రెషన్ లో కెరీర్ ని పక్కనపెట్టడమే కాదు… అందరికి దూరంగా ఉంటారు. కొంతమంది మానసిక వైద్యుడి సలహాలతో కోలుకుంటారు. మొన్నామధ్యన తన ప్రేమ విఫలమైనప్పుడు ఇలియానా డిప్రెషన్ లోకి వెళ్లి చాలా బాధపడేదాన్ని అని చెప్పింది. తాజాగా మరో తార పెళ్లి తర్వాత విడాకులు తీసుకుని మానసిక ఒత్తిడి లోనై డిప్రెషన్ లోకి వెళ్ళా అని చెబుతుంది.
ఆమె శ్వేతా బసు ప్రసాద్. ఉవ్వెత్తున ఎగసిన కెరటంలా శ్వేతా బసు తెలుగులో ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఒకటి రెండు సినిమాలకే దుకాణం సర్దేసి తర్వాత చిన్న చిన్న తప్పులతో కెరీర్ కి దూరమై.. బాలీవుడ్ వెళ్లి అక్కడ సీరియల్స్ చేసుకుంటూ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. తర్వాత ఇద్దరి మధ్యన విభేదాలు తలెత్తడంతో శ్వేతా బసు విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత శ్వేతా బసు డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. అందుకే థెరపిస్ట్ సాయం కూడా తీసుకుంటున్నానని చెబుతుంది. అయితే లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటూ తన డాక్టర్ తో వీడియో కాల్ చేసి మాట్లాడుతు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా శ్వేతా బసు చెబుతుంది.
మాటిమాటికి డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నా అని అందుకే థెరపిస్ట్ సాయం తీసుకుని ఒత్తిడిలోంచి బయట పడడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది ఈ బొద్దుగుమ్మ. అయితే తానెప్పుడూ గతంలో ఒంటరిగా ఉండలేదని.. పెళ్ళికి ముందు అమ్మ నాన్న, అలాగే కెరీర్ టైములో చుట్టూ జనం, పెళ్లి తర్వాత భర్తతో ఉన్న తనకి భర్తతో విడిపోయాక ఒక్కదాన్నే ఉంటున్నా అని.. అందుకే ఒత్తిడికి లోనవుతూన్నా అని చెబుతుంది శ్వేతా బసు ప్రసాద్.