వాల్మీకి నుండి తప్పుకున్న దేవిశ్రీ..!

చాలాకాలం తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ తమిళ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. జిగర్తాండ అనే తమిళ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసిన [more]

Update: 2019-05-18 08:28 GMT

చాలాకాలం తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ తమిళ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. జిగర్తాండ అనే తమిళ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమాకు వాల్మీకి అనే టైటిలే పెట్టారు. ఎన్నో కష్టాల మధ్య షూటింగ్ స్టార్ట్ చేసుకున్న తరువాత ఈ మూవీ నుండి హీరోయిన్ తప్పుకుంది. కారణాలు ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ ని తీసుకోనున్నారు. ఇక లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ నుండి మ్యూజిక్ డైరెక్టర్ కూడా మారిపోయారు.

దేవి స్థానంలో మిక్కీ

నిజానికి ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఏదో పాట విషయంలో హరీష్ శంకర్ – దేవికి మధ్య అభిప్రాయబేధాలు రావడంతో ఆయన కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఇప్పుడతని ప్లేస్ లో మిక్కీ జె మేయర్ మ్యూజిక్ డైరక్టర్ గా జాయిన్ అయినట్లు బోగట్టా. 14 రీల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. చాలా ఏళ్ల కిందట ఈ మూవీ తమిళంలో వచ్చింది. అప్పుడు తెలుగులో కూడా దీన్ని డబ్ చేసారు కానీ కొన్ని కారణాలు వల్ల రిలీజ్ కాలేదు. ఇప్పుడు తెలుగులో డైరెక్ట్ గా రీమేక్ అవుతుంది. ఇందులో వరుణ్ తేజ్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు.

Tags:    

Similar News