ఓటీటీలోకి వచ్చేసిన "సార్".. నేటి నుంచే స్ట్రీమింగ్

స‌ముద్ర‌ఖ‌ని, హైప‌ర్ ఆది, తనికెళ్ళ భరణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అక్కినేని సుమంత్ కూడా ముఖ్య పాత్రలో మెరిశాడు.

Update: 2023-03-17 06:04 GMT

SIR OTT Release

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. మొదటిసారి డైరెక్ట్ గా తెలుగులో నటించిన సినిమా సార్. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో సంయుక్త మేనన్ ధనుష్ సరసన నటించింది. ఈ సినిమా నుంచి వచ్చిన మాస్టారు మాస్టారు పాట ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. జీవీ ప్రకాశ్ స్వరాలు సమకూర్చాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన సార్‌ సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై..సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

స‌ముద్ర‌ఖ‌ని, హైప‌ర్ ఆది, తనికెళ్ళ భరణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అక్కినేని సుమంత్ కూడా ముఖ్య పాత్రలో మెరిశాడు. ధనుష్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ ఓపెనింగ్స్‌ను తెచ్చుకుంది. చదువుకుందాం.. చదువు’కొన’కూడదు’ అని ధనుష్‌ చెప్పిన డైలాగులు హైలెట్ గా నిలిచాయి. విద్యకు ఉన్న విలువ గురించి చర్చిస్తూనే.. మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ కు స్థానం ఇవ్వడంతో సార్ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి "సార్" అడుగుపెట్టాడు. నేటి (మార్చి 17) నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో "సార్" సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా ‘సార్‌ వస్తున్నాడు, అందరూ క్లాస్‌కు అటెండ్‌ అవ్వాల్సిందే’ అంటూ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ ను కూడా విడుదల చేసింది.


Tags:    

Similar News