మెగా హీరోల మ‌ధ్య గొడ‌వ‌లు నిజ‌మా..?

ఇండస్ట్రీలో ఒకదానితో ఒకటి సంబంధం లేని వార్తలు, పుకార్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. రామ్ చరణ్ స్టార్ డం మెయింటైన్ చేస్తుంటే…బన్నీ కుళ్ళుకుంటున్నాడని, ఎన్టీఆర్ సినిమా హిట్ [more]

;

Update: 2019-04-19 07:26 GMT
mega family response on gang leader titile
  • whatsapp icon

ఇండస్ట్రీలో ఒకదానితో ఒకటి సంబంధం లేని వార్తలు, పుకార్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. రామ్ చరణ్ స్టార్ డం మెయింటైన్ చేస్తుంటే…బన్నీ కుళ్ళుకుంటున్నాడని, ఎన్టీఆర్ సినిమా హిట్ అయితే బాలకృష్ణ కి మంటెక్కిందని… ఇలా రోజుకో వార్త ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. మొన్నీమధ్యనే మెగా హీరోలైన సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ కి మధ్యన మనస్పర్ధలు వ‌చ్చాయంటూ ఒక వార్త ఫిలింసర్కిల్స్ లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీతో తనకున్న మనస్పర్ధ‌లపై సాయి ధరమ్ తేజ్ నోరు విప్పాడు.

విభేదాలేమీ లేవు…

ప్రస్తుతం చిత్రలహరి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సాయి ధరమ్ బన్నీ విషయమే కాదు చాలా విషయాలను పంచుకున్నాడు. తాను చరణ్, వరుణ్ తేజ్ లతో ఎక్కువగా చనువుగా ఉంటానని.. తరచూ వాళ్ల‌ని కలుస్తుంటానని చెప్పాడు. సాయి ధరమ్, బన్నీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, తామంతా చిన్నప్పటి నుండి పండగలకు, సెలవులకు కలిసే ఆడుకునే వాళ్లమని, ఇక అల్లు అర్జున్ ని అప్పుడప్పుడు స్టైలింగ్ కి సంబంధించిన సలహాలు . . సూచనల కోసం కలుస్తుంటాను అని చెప్పాడు. తమ మధ్యన ఎలాంటి మనస్పర్ధ‌లు లేవని.. అందరం కలిసినప్పుడు స్టార్ డంని పక్కన పడేసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తామని చెబుతున్నాడు.

Tags:    

Similar News