‘మా’ సమస్యలకు చిరు పరిష్కారం
నరేష్ మా అధ్యక్షుడు అయిన దగ్గరనుంచి అధ్యక్షుడు నరేష్ కి మా మెంబెర్స్ కి మధ్యన విభేదాలు తలెత్తడం, అవి చిలికి చిలికి గాలివానలా మారి.. రెండు [more]
నరేష్ మా అధ్యక్షుడు అయిన దగ్గరనుంచి అధ్యక్షుడు నరేష్ కి మా మెంబెర్స్ కి మధ్యన విభేదాలు తలెత్తడం, అవి చిలికి చిలికి గాలివానలా మారి.. రెండు [more]
నరేష్ మా అధ్యక్షుడు అయిన దగ్గరనుంచి అధ్యక్షుడు నరేష్ కి మా మెంబెర్స్ కి మధ్యన విభేదాలు తలెత్తడం, అవి చిలికి చిలికి గాలివానలా మారి.. రెండు వర్గాలు గా చీలిపోయి.. ఓ వర్గం రాజశేఖర్ – జీవితల వర్గంగా , రెండో వర్గం మా అధ్యక్షుడు నరేష్ వర్గంగా మా లో చీలికలు ఏర్పడ్డాయి. రాజశేఖర్ జీవితలతో కలిసి కొంతమంది నరేష్ ని మా అధ్యక్ష పీఠం నుంచి గద్దె దించే ఏర్పాట్లు చేస్తుండగా.. నరేష్ కూడా వారికి తగిన విధంగా సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు. మా నిధుల విషయం, అలాగే మా అధ్యక్షుడు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో మా సభ్యులైనా రాజశేఖర్ మీటింగ్ కండక్ట్ చెయ్యడంతో నరేష్ వర్గానికి రాజశేఖర్ వర్గానికి మధ్యన మాటల యుద్ధం తలెత్తింది.
కొలిక్కి వచ్చేనా…..
దాసరి నారాయణరావు ఉన్నప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఆయన చాలా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీని నడిపే పెద్ద దిక్కు గా చిరంజీవి ఉంటే బావుండు అని అందరూ భావిస్తున్నారు. మా లో ఇంత గొడవ జరుగుతున్నప్పటికి చిరు ఇప్పటి వరకు మౌనం వహించారు. కానీ తాజాగా చిరంజీవి మా లో విభేదాలను చక్కదిద్దే ఏర్పాట్లను మొదలెట్టినట్లుగా తెలుస్తుంది. అందుకే ఈ రోజు గురువారం మా లో విభేదాలు తలెత్తిన ఇరు వర్గాలను తన ఇంటికి పిలిచి మాట్లాడి సమస్యకు చెక్ పెట్టడానికి చిరు రెడీ అవుతున్నారు