దిల్ రాజు కి ఇక చుక్కలే!

ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చి దిల్ రాజు మిగతా డిస్ట్రిబ్యూటర్స్ కి చుక్కలు చూపిస్తున్నాడు వరంగల్ శ్రీను. ఒకప్పుడు నైజాం అంటే దిల్ రాజు దిల్ [more]

Update: 2021-02-08 04:52 GMT

ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చి దిల్ రాజు మిగతా డిస్ట్రిబ్యూటర్స్ కి చుక్కలు చూపిస్తున్నాడు వరంగల్ శ్రీను. ఒకప్పుడు నైజాం అంటే దిల్ రాజు దిల్ రాజు అంటే నైజాం అన్నట్టుగా ఉండేది ఇంతకు ముందు. ప్రతి ఒక్క సినిమా నైజాం రైట్స్ దిల్ రాజు చేతిలోకి వెళ్ళేవి. కానీ ఇప్పుడు దిల్ రాజు మీద పోటీగా తయారయ్యాడు వరంగల్ శ్రీను. సంక్రాంతి సినిమాల విషయంలో ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా దిల్ రాజు, సురేష్ బాబు ల మీద విరుచుకుపడిన వరంగల్ శ్రీను దూకుడు మాములుగా లేదు. ఇప్పటికే మెగాస్టార్ ఆచార్య మూవీ నైజాం రైట్స్ ని భారీ డీల్ కి దక్కించుకున్న వరంగల్ శ్రీను ఇప్పుడు మిగతా సినిమాల మీద కూడా కన్నేశాడు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR కి కూడా వరంగల్ శ్రీను నైజాం హక్కుల కోసం రంగంలోకి దిగాడు. దిల్ రాజు RRR నైజాం హక్కులకు 75 కోట్లు కోట్ చేస్తే.. వరంగల్ శ్రీను 80 కోట్లు కి పోటీ పడుతున్నాడు. ఇక రీసెంట్ గా నితిన్ చెక్ నైజాం రైట్స్ ని కూడా వరంగల్ శ్రీను దక్కించుకున్నాడు. నితిన్ – రకుల్ ప్రీత్ – ప్రియా ప్రకాష్ కాంబోలో చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ సినిమా ఈ నెల 26 న విడుదల కాబోతుంది. ముందు ఫిబ్రవరి 19 నే చెక్ విడుదల అనుకున్నారు. కానీ చెక్ ట్రైలర్ తో పాటుగా చెక్ సినిమా ఫిబ్రవరి 26 కి వెళుతున్నట్టుగా ప్రకటించింది టీం. నైజాం లో చెక్ ని వరంగల్ శ్రీను విడుదల చేస్తున్నాడు. మరి చిన్న, భారీ, మీడియం బడ్జెట్ సినిమాల నైజాం రైట్స్ విషయంలో దిల్ రాజుకి పోటీకి వెళుతున్న వరంగల్ శ్రీను దిల్ రాజు మీద పోటీకి కాస్త ఎక్కువకే డీల్ సెట్ చేసుకుని తన దూకుడు చూపిస్తున్నాడు.

Tags:    

Similar News