చిన్న హీరోలకి నో ఎంట్రీనా రాజుగారూ..!

ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ సెలెబ్రిటీ పెళ్లి జరిగినా ఏ ఫంక్షన్ జరిగినా కరోనా నిబంధనల మేరకు అంటూ సింపుల్ గానే ఫ్యామిలీస్ మధ్యన గ్రాండ్ గా చేసుకుంటున్నారు [more]

Update: 2020-12-19 10:11 GMT

ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ సెలెబ్రిటీ పెళ్లి జరిగినా ఏ ఫంక్షన్ జరిగినా కరోనా నిబంధనల మేరకు అంటూ సింపుల్ గానే ఫ్యామిలీస్ మధ్యన గ్రాండ్ గా చేసుకుంటున్నారు కానీ ఫాన్స్ కి ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఆహ్వానాలు ఉండడం లేదు. కారణం ఏం లేదు కరోనా తప్ప. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో బడా నిర్మాత దిల్ రాజు 50 ఏళ్ళ పుట్టిన రోజు పార్టీ మాత్రం తెగ వైరల్ అయ్యింది. దిల్ రాజు తన మొదటి భార్య అనిత మరణం తర్వాత ఒంటరి తనం ఫీలవుతూ మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే లాక్ డౌన్ లో దిల్ రాజు రెండో పెళ్లి పెద్దగా హైలెట్ అవ్వలేదు. కానీ తాజాగా తన కొత్త భార్యని ఇండస్ట్రీకి పరిచయం చెయ్యాలనుకున్నాడో.. లేదంటే 50 ఏళ్ళ పుట్టిన రోజు పార్టీ గ్రాండ్ గా చేసుకోవాలనుకున్నాడో కానీ… స్టార్ హీరోలకు దిల్ రాజు బడా పార్టీ ఇచ్చాడు. 

గత రాత్రి దిల్ రాజు 50 వ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. పార్టీ కి రామ్ చరణ్, ప్రభాస్, ఆఖిల్, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, మహేష్, పవన్ కళ్యాణ్, చిరు, రామ్, నితిన్ రాశి ఖన్నా, పూజ హెగ్డే, అంజలి లాంటి స్టార్స్ అందరూ హాజరయ్యారు. కానీ చిన్న హీరోలెవరు ఆ పార్టీ లో కనిపించలేదు. అలాగే దర్శకులలో అనిల్ రావిపూడి తప్ప ఇంకెవరు కానరాలేదు. ఇక దిల్ రాజు కొత్త భార్య తో కలిసి కళకళలాడాడు. కూతురు అల్లుడు తో దిల్ రాజు పుట్టినరోజు కుర్రాడిలా మెరిసిపోయాడు. మరి దిల్ రాజు బర్త్ డే పార్టీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. బాలీవుడ్ స్టార్స్ రేంజ్ లో దిల్ రాజు బర్త్ డే పార్టీ హైలెట్ అయ్యింది.

Tags:    

Similar News