క్రిష్ మీద పవన్ కి కోపమా..అలాంటిదేం లేదే

అసలు పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ ని క్యాచ్ చెయ్యడం ఒక్క త్రివిక్రమ్ లాంటివాడికే సాధ్యమేమో. ఎందుకంటే త్రివిక్రమ్ తో తప్ప మరెవ్వరితోను స్నేహంగా ఉండడు. పవన్ [more]

Update: 2020-12-26 06:33 GMT

అసలు పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ ని క్యాచ్ చెయ్యడం ఒక్క త్రివిక్రమ్ లాంటివాడికే సాధ్యమేమో. ఎందుకంటే త్రివిక్రమ్ తో తప్ప మరెవ్వరితోను స్నేహంగా ఉండడు. పవన్ ఎవ్వరిని పెద్దగా దగ్గరకి రానియ్యడు. అలాంటి పవన్ తో సినిమా మొదలు పెట్టి.. ఖాళీగా ఉన్నా కదా అని మరో సినిమా తీస్తే పవన్ ఊరుకుంటాడా? పవన్ మాత్రమేనా తనతో సినిమా మొదలు పెట్టి గ్యాప్ వచ్చింది కదా అని మరో హీరోతో సినిమా చేస్తే ఏ హీరో ఊరుకోడు. కానీ పవన్ ఊరుకున్నాడు. అదే కదా పవన్ ఏ టైం లో ఎలా ఉంటాడో అనేది. అసలు మేటర్ లోకి వెళితే పవన్ కళ్యాణ్ తో దర్శకుడు క్రిష్ ఫిబ్రవరిలోనే ఓ పిరియాడికల్ మూవీ స్టార్ట్ చేసి ఓ షెడ్యూల్ చిత్రకరణ కూడా చేసాడు. మధ్యలో వకీల్ సాబ్, కరోనా తో క్రిష్ – పవన్ మూవీకి బ్రేకులు పడ్డాయి.

కరోనా కారణంగా, దీక్షల కారణంగా పవన్ కళ్యాణ్ ఇంకా సినిమా షూటింగ్స్ కోసం తయారవలేదు కదా అని తాను ఇష్టపడ్డ కొండనవల ని సినిమా చేద్దామని పవన్ పర్మిషన్ అడిగితే చేసుకోమన్నాడట. కొండనవల చదివాకా నిద్రపట్టలేదని.. పవన్ పర్మిషన్ అడిగి ఒక 45 రోజుల్లో సినిమా కంప్లీట్ చేసి మళ్ళీ మన సినిమా కోసం సిద్దమవుతానని పవన్ ని అడగ్గానే ఒప్పుకున్నాడట. కొండనవల ఆధారంగానే పవన్ మేనల్లుడు వైష్ణవ తేజ్ – రకుల్ కాంబోలో సినిమాని 45 రోజుల్లో ముగించేశాడు క్రిష్. మరి ఇలా పవన్ మాత్రమే ఒప్పుకున్నాడు కానీ.. మరో హీరో అయితే మరో సినిమా చేస్తే ఒప్పుకోరంటూ క్రిష్ ఓ టాక్ షోలో చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News