మణిరత్నం, శంకర్ మహదేవన్‌లకు భారత్ అస్మిత రాష్ట్రీయ పురస్కారం
పుణేకు చెందిన ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీ గత 18 ఏళ్లుగా వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులను భారత్ అస్మిత
మణిరత్నం.. క్లాసిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన. ఆయన తీసిన ఒక్కో సినిమా ఒక్కో అద్భుతమనే చెప్పాలి. ఎన్నో క్లాసిక్ సినిమాలను తీసిన ఆయన.. ఇప్పటి వరకూ పద్మశ్రీ సహా.. అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. సినీ కళామతల్లికి ఆయన చేసిన సేవలకు గాను మరో అవార్డు ఆయనను వరించింది. అదే భారత్ అస్మిత రాష్ట్రీయ పురస్కారం.
పుణేకు చెందిన ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీ గత 18 ఏళ్లుగా వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులను భారత్ అస్మిత రాష్ట్రీయ అవార్డులతో సత్కరిస్తోంది. ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని భారత్ అస్మిత్ ఫౌండేషన్ తో పాటు ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్న్‌మెంట్ నిర్వాహకులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా భారత్ అస్మిత రాష్ట్రీయ పురస్కారాన్ని పలువురు ప్రముఖులకు అందించనున్నారు. అందులో భాగంగా ఈసారి సినీరంగం తరపున దర్శకుడు మణిరత్నంకు ఈ అవార్డును ప్రకటించారు.
Also Read : ఇక జగన్ తోనే చర్చలు.. మరెవ్వరితో కాదు
మణిరత్నంతో పాటు సినీ రంగానికి చెందిన మరో వ్యక్తికి కూడా ఈ అవార్డును ఇవ్వనున్నారు. ఆయనే గాయకుడు శంకర్ మహదేవన్. శంకర్ మహదేవన్ ఎంత గొప్ప గాయకుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పాడిన పాటలు వింటే.. తన్మయత్వం చెందాల్సిందే. భక్తి గీతాలు, మెలోడీ పాటలు దేనికదే ప్రత్యేకంగా పాడుతారాయన. సంగీత దర్శకుడిగా, సహ గాయకుడిగా.. పద్మశ్రీతో పాటు మరిన్ని అవార్డులు అందుకున్న శంకర్ మహదేవన్.. భారత్ అస్మిత రాష్ట్రీయ పురస్కారాన్నీ అందుకోనున్నారు. ఈ సారి కరోనా కారణంగా ఈ అవార్డుల పురస్కారాలను వర్చువల్ గా నిర్వహించనున్నారు.