జగన్ పై వర్మ షాకింగ్ కామెంట్స్
ఏపీ ప్రభుత్వం సినిమా రేట్లను తగ్గించడం తప్పిదమేనని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు
వివాదాలకు నిత్యం దగ్గరగా ఉండే వ్యక్తి రాంగోపాల్ వర్మ. ఆయన ఏం మాట్లాడినా అది కాంట్రవర్సీయే. ఆయన సినిమాలు కూడా ఎప్పుడూ వివాదాలను సృష్టిస్తూనే ఉంటాయి. అదే ఆయనకు కావాల్సింది. కానీ గత కొద్దిరోజులుగా ఏపీలో జరుగుతున్న సినిమా టిక్కెట్ల తగ్గింపు రాంగోపాల్ వర్మ స్పందించలేదు. కానీ తాజాగా ఆయన స్పందించారు. ప్రభుత్వం విధానాన్ని, నిర్ణయాన్ని రాంగోపాల్ వర్మ తప్పు పట్టారు.
నష్టపోయేది.....
ఏపీ ప్రభుత్వం సినిమా రేట్లను తగ్గించడం తప్పిదమేనని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టిక్కెట్ల ధరలు నిర్మాతలకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. ఏదైనా వస్తువును విక్రయించుకునే హక్కు దాని ఉత్పత్తిదారుడికి ఉంటుందంటున్నారు. కొనాలా? లేదా? అన్నది వినియోగదారుడి ఇష్టమన్నారు. సినిమా కూడా అంతే. ఎక్కువ రేట్లు పెట్టినా చూడాలా? లేదా? అన్నది ప్రేక్షకుడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. హీరోలు తమ రెమ్యునరేషన్ ను తగ్గించుకోరని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయంతో అల్టిమేట్ గా నష్టపోయేది నిర్మాత మాత్రమేనని చెప్పారు. ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తాను చెప్పలేనని రాంగోపాల్ వర్మ అన్నారు.