సెకన్లలో ఆ పాట రాసేశారు
సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "సీతారామశాస్త్రిగారితో నా ఫస్ట్ మెమొరీ అన్నపూర్ణ స్టూడియోలో. ఒక చెట్టుకింద కూర్చుని సిట్యుయేషన్ చెప్పి సాంగ్ రాయమన్నాను. కాలేజీ సాంగ్ అని, కవిత్వం కాకుండా మామూలుగా స్టూడెంట్ మాట్లాడే మాటలతో పాట రాయమన్నాను. వెంటనే సెకన్లలో నాకు పాట ఇచ్చేశారు. బాటనీ పాఠముంది పాట సెకన్లలో సీతారామశాస్త్రి గారు రాసివ్వడం ఆశ్చర్యం కలిగించింది. "
బాధగా ఉన్నా...
"ఇలాఎన్నో మెమొరీలు నాకు ఆయనతో ఉన్నాయి. ఆయన మరణం అందరికీ షాకింగ్. కానీ ఒక ఫిలాసఫర్ చెప్పినట్లు అందరూ జీవిస్తారు. కానీ కొందరు మాత్రమే ముందు తరాలకు మార్గదర్శిా, ఇన్సిపిరేషన్ గా మిగిలిపోతారు. ఆయన మరణించినందుకు బాధగా ఉన్నా తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత వరూ ఆయనను అందరూ ఇన్సిపిరేషన్ గానే తీసుకుంటారు. సిరివెన్నెల మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన మన మధ్య ఎప్పటికీ బతికే ఉంటారు" అని రాంగోపాల్ వర్మ భావోద్వేగమైన ట్వీట్ చేశారు.