శంకర్ కి మొదలైందిగా…!

దర్శకుడు శంకర్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందనిపిస్తుంది. ఎందుకంటే శంకర్ తీసే సినిమాకి నిర్మాతలతో విపరీతమైన బడ్జెట్ పెట్టిస్తాడు. నిర్మాతలు కూడా శంకర్ ఎంత అడిగితే [more]

Update: 2019-02-19 07:36 GMT

దర్శకుడు శంకర్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందనిపిస్తుంది. ఎందుకంటే శంకర్ తీసే సినిమాకి నిర్మాతలతో విపరీతమైన బడ్జెట్ పెట్టిస్తాడు. నిర్మాతలు కూడా శంకర్ ఎంత అడిగితే అంత పెట్టేస్తారు. అందుకే లైకా ప్రొడక్షన్ వారు 2.ఓ సినిమాకి శంకర్ అడగడంతోనే 500 కోట్లపైనే పెట్టేసారు. పాపం 2.ఓ సినిమా మాత్రం చివరికి నిర్మాతలకు 100 కోట్ల నష్టాలు మిగిల్చింది. 2.ఓ సినిమా ఫైనల్ రన్ లో 100 కోట్ల నష్టాలొచ్చాయని… అందుకే లైకా ప్రొడక్షన్స్ వారు ప్రస్తుతం శంకర్ మీద భారీగా ఇన్వెస్ట్ చెయ్యడానికి వెనకడుగు వేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

నిర్మాతతో విభేదాలు…

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 సినిమా తెరకెక్కుతుంది. లైకా వారు ఇండియన్ 2ని కూడా భారీగానే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చిత్రీకరణలో ఉన్న ఇండియన్ 2 గురించి ఒక న్యూస్ ఇప్పుడు మీడియాలో హైలెట్ అయ్యింది. బడ్జెట్ విషయంలో డైరెక్టర్ – నిర్మాత మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే ఇండియన్ 2 షూట్‌కి బ్రేక్ పడినట్లుగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. 2.ఓకి కావాల్సినంత పెట్టి నిర్మించామని… కానీ 100 కోట్ల లాస్ వచ్చేదని.. అందుకే ఇండియన్ 2ని తక్కువ అంటే మీడియం బడ్జెట్ లో నిర్మిద్దామని.. శంకర్ కి చెప్పారట.

షూటింగ్ కు బ్రేక్…

కానీ దర్శకుడు శంకర్ మాత్రం ససేమిరా అంటున్నాడట. తక్కువ బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తే… క్వాలిటీ దెబ్బ తింటుందని శంకర్ వాదనగా చెబుతున్నారు. దీంతో లైకా వారికి శంకర్ కి ఆమధ్య విభేదాలు తలెత్తడంతో… ఇండియన్ 2 షూటింగ్ బ్రేకిచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే శంకర్ మాత్రం వేరే నిర్మాతల కోసమూ ట్రై చేస్తున్నట్లుగా వినికిడి. ఒకవేళ ఇండియన్ 2కి కొత్త నిర్మాత దొరికితే.. ఆ సినిమా మళ్లీ పట్టాలెక్కుతుంది. లేదంటే లేదు. మరి దీనిని బట్టి శంకర్ కి నిర్మాతల విషయమై సెగ మొదలైనట్లుగా కనబడటం లేదు.

Tags:    

Similar News