విశాల్ పై ప్రేమ కురిపిస్తున్నాడు!!

గత ఏడాది డిటెక్టీవ్ దర్శకుడు మిస్కిన్, డిటెక్టీవ్ హీరో విశాల్ కి మధ్యన ఫైట్ జరగడం డిటెక్టీవ్ సీక్వెల్ నుండి దర్శకుడు మిస్కిన్ తప్పుకోవడం హీరో విశాల్ [more]

Update: 2020-06-06 08:16 GMT

గత ఏడాది డిటెక్టీవ్ దర్శకుడు మిస్కిన్, డిటెక్టీవ్ హీరో విశాల్ కి మధ్యన ఫైట్ జరగడం డిటెక్టీవ్ సీక్వెల్ నుండి దర్శకుడు మిస్కిన్ తప్పుకోవడం హీరో విశాల్ డిటెక్టీవ్ 2 కి దర్శకుడిగా మారడం అంత కోలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. తర్వాత మిస్కిన్ కూడా ఎక్కడా తగ్గకుండా విశాల్ పై ఆరోపణలు చేసాడు. విశాల్ కి కోపమెక్కువ, నేను డిటెక్టీవ్ కోసం భారీ బడ్జెట్, భారీ రెమ్యునరేషన్ అడిగానా అంటూ వెటకారంగా ఆగ్రహం వ్యక్తం చేసాడు. కానీ విశాల్ మాత్రం మిస్కిన్ విషయంలో గుంభనంగానే ఉన్నాడు. మిస్కిన్ మాత్రం ఎక్కడపడితే అక్కడ విశాల్ పై నోరు పారేసుకున్నాడు. ఈ విషయం జరిగిన ఇన్నాళ్ళకి మల్లి మిస్కిన్ విశాల్ పై తెగ ప్రేమ ఒలకబోస్తున్నాడు. కారణం ఏమిటి అనేది మిస్కిన్ కె తెలియాలి.

తాజాగా విశాల్ చాలా మంచోడు అని, విశాల్ కి కాస్త కోపమెక్కువ , డిటెక్టీవ్ 2 విషయంలో మా మధ్యన విభేదాలొచ్చి మాట మాటా అనుకున్నాము…ఆ విషయంలో విశాల్ కి కోపమొచ్చింది. నాకు మండింది. ఆలా మేమిద్దరం దూరమయ్యాం. విశాల్ నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం, లేదు.ఎందుకంటే విశాల్ అంటే నాకిష్టం, విశాల్ పై నాకు అభిమానముంది. విశాల్ నాకు సోదరుడులాంటోడు. మేమిద్దరం కలిసి మంచిగా ఉన్నప్పుడు విశాల్ నా ఆఫీస్ కి వారానికి రెండుసార్లు వచ్చేవాడు. విశాల్ కి వర్క్ డెడికేషన్ చాలా ఎక్కువ… ఐదంతస్తుల మేడ మీదనుండి షూటింగ్ కోసం దూకెయ్యాలంటే .. ఎందుకు దూకాలి అని అడగకుండా ఎక్కడ దూకాలి అనిమాత్రమే అడుగుతాడు. అంటూ విశాల్ పై ప్రేమని కురిపిస్తున్నాడు.

Tags:    

Similar News