ఆ రీమేక్ తోనే హిట్ కొట్టాడు.. దాని సీక్వెల్ వదులుతాడా?

మలయాళంలో మోహన్ లాల్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన దృశ్యం సినిమా అక్కడ దాదాపుగా 50 కోట్ల కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. దానితో తెలుగులోనే కాదు.. ఆ [more]

Update: 2020-07-11 09:48 GMT

మలయాళంలో మోహన్ లాల్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన దృశ్యం సినిమా అక్కడ దాదాపుగా 50 కోట్ల కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. దానితో తెలుగులోనే కాదు.. ఆ సినిమాని తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్ చేసారు. తెలుగులో వెంకటేష్ దృశ్యం రీమేక్ చేస్తే… తమిళంలో కమల్ హాసన్ రీమేక్ చేసాడు. ఇక హిందీలో అజయ్ దేవగన్ దృశ్యం రీమేక్ చేస్తే.. అన్ని భాషల్లోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు మలయాళంలో దృశ్యం సీక్వెల్ అంటూ వార్తలు రావడం మాత్రమే కాదు.. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే అక్కడ ఆ సినిమా సీక్వెల్ రావడమే.. ఇక్కడ వెంకీ ఆ సినిమా ని రీమేక్ చేస్తాడని అంటున్నాడు. అసలే రీమేక్ రాజా.. అందులోను దృశ్యం తో బంపర్ హిట్ కొట్టాడు. అలాంటిది దాని సీక్వెల్ మాత్రం వదులుతాడా అని అంటున్నారు.

అయితే దృశ్యం సీక్వెల్ దృశ్యం సినిమా ఎక్కడ ఎండ్ అయ్యిందో అక్కడ నుండే దాని సీక్వెల్ మొదలు కాబోతుందట. కేసు క్లోజ్ అయ్యింది అనుకున్న కేసును మళ్లీ ఓ స్పెషల్ పోలీస్ అధికారి తిరగదోడడంతో హీరో చిక్కుల్లో పడే నేపథ్యంలో ఈ దృశ్యం సీక్వెల్ కథ నడుస్తుందని మలయాళ దర్శకుడు జీతు ఇప్పటికే క్లూ కూడా ఇచ్చాడు. మలయాళం లో ఆ సినిమా తెరకెక్కుతుంది అనగానే.. ఇప్పడు ఇతర భాషల రీమేకపై అందరిలో ఊహాగానాలు మొదలైతే.. ఇప్పడు మళయాళంలోనే కాదు.. దర్శకుడు జీతూ ఈ సినిమాని పాన్ ఇండియా ఫిలిం గా మార్చిన మార్చేస్తాడేమోలే అంటున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లో పాన్ ఇండియా క్రేజ్ నడవడం, దృశ్యం అన్ని భాషల్లో రీమేక్ అయ్యి సూపర్ అవడంతో.. ఎలాగూ క్రేజ్ ఉంటుంది కాబట్టి పాన్ ఇండియా గా మార్చేద్దామని జిత్తు అనుకున్నా అనుకోవచ్చనే అంటున్నారు.

Tags:    

Similar News