సినిమా హిట్టే కానీ. ప్రమోషన్స్ లేవు!!

తెలుగులో దుల్కర్ సల్మాన్ క్రేజ్ మామూలుది కాదు.. మహానటి తో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందాడు. దుల్కర్ హీరోగా స్టైలిష్ గా, అందంగా ఉంటాడు. మలయాళ హీరో [more]

Update: 2020-03-05 12:18 GMT

తెలుగులో దుల్కర్ సల్మాన్ క్రేజ్ మామూలుది కాదు.. మహానటి తో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందాడు. దుల్కర్ హీరోగా స్టైలిష్ గా, అందంగా ఉంటాడు. మలయాళ హీరో అయినప్పటికీ… మహానటితో తెలుగు హీరోగా మరిపోయాడు. ఇక పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న రీతూ వర్మ తెలుగులో వర్కవుట్ అవ్వక తమిళ మలయాళంలోకి వెళ్ళిపోయింది. అయితే దుల్కర్ సల్మాన్ – రీతూ జంటగా నటించిన తెలుగు – తమిళ మూవీ కనులు కనులను దోచాయంటే సినిమా గత శుక్రవారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా ఉండడంతో… సినిమా కి క్రిటిక్స్ హిట్ రివ్యూస్ ఇచ్చారు. అసలు రివ్యూ రాయని వారు కూడా సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాక నాలుగైదు రోజులకి రివ్యూ రాసారంటే ఆ సినిమాలో దమ్ము ఉందనే అర్ధం. అయితే సినిమా విడుదలకు ముందు పెద్దగా ప్రమోట్ చేయకపోవడంతో ఆ సినిమా ఎప్పుడు మొదలై ఎప్పుడు రిలీజ్ కి సిద్ధమయ్యిందో తెలియలేదు ప్రేక్షకులకు.

కేవలం దుల్కర్ ఇంటర్వ్యూ తోనే సినిమాని ప్రమోట్ చేసారు. ఇక విడుదలై హిట్ కొట్టాక కూడా సినిమాని ఎవరూ అంటే హీరో కానీ, హీరోయిన్ కానీ దర్శకనిర్మాతలు కానీ పట్టించుకోలేదు. లేదంటే తెలుగులో ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేది తమిళంలో హిట్ అయిన సినిమా తెలుగులో హిట్ అయినా ప్రేక్షకులు కరువయ్యారు. కారణం ఈ సినిమా జనాల్లోకి వెళ్లకపోవడమే. ప్రేక్షకులకు తెలియకపోవడం, అందులోని నాని హిట్ సినిమాని కాస్త గట్టిగ ప్రమోట్ చెయ్యడంతో యావరేజ్ అయిన సినిమాకి హిట్ కలెక్షన్స్ వస్తే.. హిట్ అయిన సినిమాకి ప్లాప్ కలెక్షన్స్ వస్తున్నాయి అంటే కనులకనులను దోచాయంటే సినిమాని సరిగ్గా టీం ప్రమోట్ చేయకపోవడమే కారణం. నిన్న ఏదో సక్సెస్ మీట్ పెట్టి చేతులు దులిపేసుకుతిన్నారు కానీ.. సినిమాని ఓ పద్ధతిలో ప్రమోషన్ చేసి ఉంటె ఖచ్చితంగా కనులకనులను దోచాయంటే సినిమా పెద్ద హిట్ అయ్యి ఉండేది.

Similar News