బిగ్ బాస్ హౌస్ లో మానస్ ఒంటరిగా గడుపుతున్నారా?

కొందరు మెతకగా ఉంటారు. మరికొందరు దూకుడుగా ఉంటారు. మెతకగా ఉంటే టాలెంట్ లేదని అర్థం కాదు. కొందరు తీరే అంత. బిగ్ బాస్ హౌస్ లో మానస్ [more]

Update: 2021-09-07 07:32 GMT

కొందరు మెతకగా ఉంటారు. మరికొందరు దూకుడుగా ఉంటారు. మెతకగా ఉంటే టాలెంట్ లేదని అర్థం కాదు. కొందరు తీరే అంత. బిగ్ బాస్ హౌస్ లో మానస్ పరిస్థితి కూడా అంతే. తొలి వారం నామినేషన్ల ఘట్టంలో హౌస్ మేట్స్ అంతా మానస్ ను టార్గెట్ చేశారు. మానస్ మృదు స్వభావి. నెమ్మదైన మనస్తత్వం. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున సయితం తల్లి చాటు బిడ్డగా మానస్ ను అనడం దీనికి ఉదాహరణ. హౌస్ లోకి ప్రవేశించిన ఒక్కరోజులోనే మానస్ యాటిట్యూడ్ బాగా లేదని హౌస్ మేట్స్ డిసైడ్ చేయడం సరికాదు. కొంత సమయం ఇస్తే తనను తాను నిరూపించుకునే అవకాశముంది. మానస్ కూడా తాను నామినేషన్ చేసేటప్పుడు అదే విషయాన్ని చెప్పారు. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికి మానస్ టార్గెట్ అయ్యాడనే అనిపిస్తుంది.

Tags:    

Similar News