తెలుగమ్మాయి పంట పండినట్లే..!

వరుసగా సినిమాలు చేస్తున్నా ఏ మాత్రం క్రేజ్ సంపాదించుకోలేకపోతుంది తెలుగమ్మాయి ఈషా రెబ్బ. చిన్నాచితకా హీరోలతో సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల సినిమాల్లోనూ మెరుస్తుంది. కానీ ప్రయోజనం [more]

Update: 2019-02-04 06:22 GMT

వరుసగా సినిమాలు చేస్తున్నా ఏ మాత్రం క్రేజ్ సంపాదించుకోలేకపోతుంది తెలుగమ్మాయి ఈషా రెబ్బ. చిన్నాచితకా హీరోలతో సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల సినిమాల్లోనూ మెరుస్తుంది. కానీ ప్రయోజనం శూన్యం. అందం, అభినయం ఉన్నప్పటికీ.. లక్కు అనేది అవసరం అంటుంటారు… అది పర్ఫెక్ట్ గా ఈషా రెబ్బకి సూట్ అవుతుంది. ఇక ఎప్పుడూ ట్రెడిషనల్ గా ఉంటే.. అవకాశాలు రావడం లేదనో ఏమిటో ఈషా ఈ మధ్యన గ్లామర్ షో చేస్తుంది. గ్లామర్ డ్రెస్సులతో హాట్ ఫొటో షూట్స్ తో రెచ్చిపోతుంది. అది సుమంత్ తో కలిసి నటించిన సుబ్రమణ్యపురం అప్పటి నుండి మరికాస్త ఎక్కువైంది.

వాల్మీకిలో హీరోయన్ గా…

ఇక ఆ హాట్ షోకి హరీష్ శంకర్ పడిపోయాడనే న్యూస్ ఇప్పుడు వినపడుతోంది. హరీష్ శంకర్ తన కొత్త సినిమా కోసం ఈషా రెబ్బ పేరుని పరిశీలిస్తున్నాడని తెలుస్తోంది. వరుణ్ తేజ్ కీలకపాత్రలో హారిష్ శంకర్.. తమిళ జిగర్తాండని తెలుగులో వాల్మీకి అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు. వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఒక హీరో పాత్రకి ఈమధ్యనే శ్రీ విష్ణుని ఎంపిక చేసినట్లుగా వార్తలొచ్చాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి ముందుగా ఛలో, గీత గోవిందం, దేవదాస్ భామ రశ్మికని అనుకున్నప్పటికీ.. తాజాగా హరీష్ శంకర్ ఈషా రెబ్బ అయితే బాగుంటుందని ఆలోచనలో ఉన్నాడట.

లక్కు కలిసొచ్చినట్లేనా..!

మరి నిజంగానే హరీష్ శంకర్ ఏ కొత్త హీరోయిన్ కోసమో పాకులాడకుండా.. ఇలా ఒక తెలుగమ్మాయికి ఛాన్స్ ఇస్తే నిజంగా.. ఈషా రెబ్బ పంట పండినట్లే. ఎందుకంటే ఈషా రెబ్బ ఈ మధ్యన వరుస వైఫల్యాలతో బాధపడుతుంది. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వస్తే ఈషా రెబ్బకి మరిన్ని అవకాశాలు రావడం పక్కానే. ఎందుకంటే హరీష్ శంకర్ తన సినిమాల్లో హీరోయిన్స్ ని కాస్త హాట్ గానే చూపెడతాడు. అందుకు పెద్ద ఉదాహరణ పూజా హెగ్డే. పూజా హెగ్డేని డీజే సినిమా కోసమే బికినీ వేయించాడు హరీష్. ఆ సినిమాతో అమ్మడు ఫేట్ టాలీవుడ్ లో ఎలా పరిగెడుతుందో అందరికి తెలిసిందే.

Tags:    

Similar News