దసరా కూడా కష్టమే సుమీ..!!

వేసవి సెలవల్లో వారానికో సినిమా విడుదలై పిల్లలు ఎంజాయ్ చేసేవారు. భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలు అన్ని వేసవిని టార్గెట్ చేసేవి. వేసవిలో సినిమాలు విడుదలైతే [more]

Update: 2020-06-27 07:20 GMT

వేసవి సెలవల్లో వారానికో సినిమా విడుదలై పిల్లలు ఎంజాయ్ చేసేవారు. భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలు అన్ని వేసవిని టార్గెట్ చేసేవి. వేసవిలో సినిమాలు విడుదలైతే నిర్మాతలు కూడా కాసులు. బాక్సాఫీసు కళకళకలాడేది. కానీ కరోనా అందరి కలల మీద నీళ్లు చల్లింది. కరోనా సినిమాల విడుదల ఆపెయ్యడం, షూటింగ్స్ బంద్ చెయ్యడం ఇలా సినిమా ప్రపంచం మొత్తంమూగబోయింది. ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపు వచ్చి.. సినిమా షూటింగ్స్ మొదలైనా సెట్స్ మీదకెళ్లే ధైర్యం చేయడం లేదు. వేసవిలో విడుదల కావాల్సిన సినిమాలన్నీ దసరా బరిలో నిలవబోతున్నాయనే టాక్ వినబడుతున్నా అది సాధ్యమయ్యే పనేనా అంటున్నారు.

కరోనా ఎప్పటికి తగ్గుతుంది.. ఎప్పుడు సెట్స్ మీదకెళ్ళాలి. లాక్ డౌన్ సడలింపులతో కరోనా ఉదృతి పెరిగిపోయింది. ఆగష్టు నుండి హీరోలంతా షూటింగ్ కి రెడీ అవుదామని అంటున్నారు కానీ…. ఆగష్టు నాటికీ కరోనా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి కొద్దిగా బ్యాలెన్స్ ఉన్న సినిమాల షూటిగ్ అయినా చేస్తే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానిచ్చి దసరాకి సినిమాలను రెడీ చేస్తారు. కానీ థియేటర్స్ తెర్చుకోవాలి. ఇప్పటికే చిన్న చితక సినిమాలు ఓటిటి బాట పట్టాయి. ఒకవేళ ఆగష్టు నాటికి థియేటర్స్ తెరుచుకోపోతే.. మీడియం అండ్ పెద్ద సినిమాలు కూడా ఓటిటి బాట పట్టినా పెద్దగా ఆశ్చర్యపోవక్కర్లేదు.  

Tags:    

Similar News