మహేష్…టోటల్ కన్ఫ్యూజన్

భరత్ అనే నేను తర్వాత రెండు నెలల గ్యాప్ తో మహర్షి సినిమాని మొదలెట్టిన మహేష్ బాబు.. మహర్షి తర్వాత వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు [more]

Update: 2019-10-25 07:15 GMT

భరత్ అనే నేను తర్వాత రెండు నెలల గ్యాప్ తో మహర్షి సినిమాని మొదలెట్టిన మహేష్ బాబు.. మహర్షి తర్వాత వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరూ సినిమాని పట్టాలెక్కించాడు. ఎప్పుడూ నెలలు నెలలు గ్యాప్ తీసుకునే మహేష్ బాబు ఇప్పుడు అసలు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇక అనిల్ రావిపూడి తర్వాత మహేష్ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే మహేష్ ఎవరితో తన తదుపరి చిత్రాన్ని చేస్తాడో అంటూ మీడియా లో రోజుకో న్యూస్ అయితే ప్రచారంలోకి వస్తుంది. మహేష్ అసలైతే సుకుమార్ తో చెయ్యాల్సింది. కానీ సుకుమార్ – మహేష్ సినిమా ఆగిపోవడమే కాదు. మళ్లీ వారి కాంబోలో మరో మూవీ వచ్చే ఛాన్స్ లేదు. ఇక అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ చెప్పిన కథలో మార్పులు కోరిన మహేష్ కి సందీప్ వంగ కథలో మార్పులు చేర్పులు లేవంటూ బాలీవుడ్ ఫ్త్లైట్ ఎక్కేశాడు.

వెయిట్ అండ్ సీ…

ఇక పరశురామ్ తో మహేష్ సినిమా అన్నారు. కానీ పరశురామ్ చెప్పిన కథ కూడా మహేష్ ని మెప్పించలేకపోయింది. ఇక తాజాగా కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మహేష్ సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ తో మహేష్ కథపై చర్చలు జరిపాడని అంటున్నారు. కానీ ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 ని కంప్లీట్ చెయ్యడానికి ఇంకా టైం పడుతుంది. ఇక మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి తో మళ్లీ మహేష్ సినిమా చేస్తా అన్నాడు. ఇక వంశీ కూడా మహేష్ ని వదలకుండా తిరుగుతున్నాడు. కానీ వంశీ పూర్తి కథ, స్క్రిప్ట్ రెడీ అవలేదు. మరి మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత వెంటనే మరో సినిమా తో సెట్స్ మీదకెళ్ళలేడు. సంక్రాతి కి సరిలేరు విడుదలైతే.. తన తదుపరి చిత్రం కోసం మహేష్ ఎన్ని నెలలు వెయిట్ చెయ్యాలో అనేది డిసైడ్ అవుతుంది.

 

 

Tags:    

Similar News