కాజల్ హని మూన్ ఖరీదు?

ఆచార్య, భారతీయుడు, మోసగాళ్లు సినిమా షూటింగ్ అన్ని కరోనా కారణముగా వాయిదా పడడం అదే కరోనా టైం లో కాజల్ అగర్వాల్ బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లు [more]

Update: 2020-11-17 11:47 GMT

ఆచార్య, భారతీయుడు, మోసగాళ్లు సినిమా షూటింగ్ అన్ని కరోనా కారణముగా వాయిదా పడడం అదే కరోనా టైం లో కాజల్ అగర్వాల్ బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకుని.. హానిమూన్ కోసం మాల్ దీవులకు ఎగిరిపోయింది. కరోనా కదా… పెళ్లి సింపుల్ గా చేసుకుంది.. ఇక తర్వాత షూటింగ్ లేదు హానీమూన్ లేదు, ఏమి లేదు అనుకుంటే.. కాజల్ మాత్రం భర్త గౌతమ్ కిచ్లు తో హాని మూన్ ట్రిప్ లో రొమాంటిక్ గా రెచ్చిపోతుంది. హాని మూన్ కి వెళ్లిన కాజల్ భర్త గౌతమ్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చెయ్యడం, నెటిజెన్స్ చేతిలో అక్షింతలు వేయించుకోవడం కూడా అయ్యింది కాజల్ కి. అయితే ఆ ఫోటోల విషయం పక్కనబెడితే ఇప్పుడు కాజల్ హాని మూన్ బడ్జెట్ విషయం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ అవుతుంది.

ఫోటో షూట్స్ తోనే ట్రోలింగ్ కి గురైన కాజల్ అగర్వాల్ ఇప్పుడు హాని మూన్ విషయంలోనూ సోషల్ మీడియాకెక్కింది. కాజల్ అగర్వాల్ కరోనా టైం లో మాల్ దీవ్స్ కి వెళ్లి హానిమూన్ ని ఎంజాయ్ చెయ్యడానికిగాను ఈ జంట ఏకంగా 50 లక్షలు ఖర్చు పెట్టిందట. అవసరమైనప్పుడు ఫోటో షూట్స్, అలాగే రిసార్ట్స్, అండర్ వాటర్ సూట్స్ లో కాజల్ గర్వాల్ జంట ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారనే విషయం ఎప్పటికప్పుడు కాజల్ అప్ డేట్స్ ఇస్తుంది. మరి కాజల్ పెళ్లి ఖర్చు కన్నా ఇప్పుడు హాని మూన్ కాస్ట్లీ ముచ్చట సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పబ్లసిటీ జరుగుతుంది అంటే.. ఈ జంట ఏ రేంజ్ ఓ తమ హానిమూన్ ని ప్లాన్ చేసి మరీ పబ్లసిటీ చేసిందో కదా. ఏదైనా కాజల్ హాని మూన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ అయ్యింది.

Tags:    

Similar News