ప్రముఖ గేయ రచయిత ఆత్మహత్య

తొలుత జానపద గీతాలు రచించిన కందికొండ.. చక్రి పరిచయంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం..

Update: 2022-03-12 12:01 GMT

హైదరాబాద్ : ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన.. మోతీనగర్ లోని సాయి శ్రీనివాస్ టవర్స్ లో తాను నివసిస్తున్న అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లి గ్రామంలో పుట్టిన కందికొండ.. చదువుకునే రోజుల్లోనే పాటలు రాయడం ప్రారంభించారు. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో స్వర్గీయ మ్యూజిక్ డైరెక్టర్ చక్రితో పరిచయం ఏర్పడింది.

తొలుత జానపద గీతాలు రచించిన కందికొండ.. చక్రి పరిచయంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో మళ్లి కూయవే గువ్వా పాటను కందికొండ రచించగా.. చక్రి దానికి స్వరాలు సమకూర్చారు. ఆ పాట ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలిచిపోయింది. కందికొండ 12 ఏళ్ల సినీ ప్రస్థానంలో..1000కి పైగా పాటలు రాశారు. కేవలం పాటల్లోనే కాదు.. కవిత్వం రాయడంలోనూ కందికొండ దిట్ట. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయటం ఆయన ప్రత్యేకత. మట్టిమనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాన్ని కథలుగా రచించి ఆయన కథకుడిగా కూడా విశేష ఆదరణ పొందారు. కందికొండ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి చెందారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. సంతాపం తెలుపుతున్నారు.


Tags:    

Similar News