పరుచూరి వెంకటేశ్వరరావు ఇలా అయిపోయారేంటి.. షాకవుతున్న నెటిజన్లు !
తాజాగా పరుచూరి వెంకటేశ్వరరావు ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ ఫొటో చూసిన నెటిజన్లు, ఆయన ఫాలోవర్లు షాకవుతున్నారు.
హైదరాబాద్ : పరుచూరి సోదరులు.. టాలీవుడ్ లో ఫేమస్ రైటర్స్ అంటే ఠక్కున గుర్తొచ్చేది వీరే. ఎన్నో సినిమాలకు సంభాషణలు రాసిన ఘనత వారి సొంతం. అసాధారణ రచనా నైపుణ్యం, శక్తివంతమైన సంభాషణలకు ప్రసిద్ధి చెందారు పరుచూరి బ్రదర్స్. 300 సినిమాలకు పైగా కథలు రాయగా.. వాటిలా చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అప్పుడప్పుడూ సినిమాల్లోనూ కనిపిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తుంటారు. పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు సినిమా కథలు రాయడంతో పాటు.. నటనలోనూ గుర్తింపు పొందారు.
తాజాగా పరుచూరి వెంకటేశ్వరరావు ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ ఫొటో చూసిన నెటిజన్లు, ఆయన ఫాలోవర్లు షాకవుతున్నారు. ఇంతకీ ఆయనకు ఏమైంది ? వైరల్ అయిన పిక్ ను చూస్తే.. పరుచూరి వెంకటేశ్వరరావు చాలా బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ముఖం కళావిహీనంగా మారిపోయింది. చాలా వరకూ బరువు కూడా తగ్గిపోయారు. ప్రముఖ దర్శకుడు జయంత్ ఆ ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ అయింది. ఆ ఫొటో కింద జయంత్ ఇలా రాసుకొచ్చారు. "పరుచూరి వెంకటేశ్వర్ రావు శరీరం, వృద్ధాప్యాన్ని చూసి కొంచెం బాధపడ్డాను, కానీ అతని మనస్సు ఇప్పటికీ ఎప్పటిలాగే పదునైనది, అతను, అతని సోదరుడు పరుచూరి గోపాలకృష్ణ 300 కంటే ఎక్కువ సినిమాలు రాశారు! అచీవ్‌మెంట్ కాదు! 200 ప్లస్ బ్లాక్‌బస్టర్స్! లవ్ యూ సర్." అని తెలిపారు.