పవన్ ఆరోగ్యంపై ఫాన్స్ లో కంగారు
పవన్ కళ్యాణ్ కి కరోనా రావడం తగ్గడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ కి కరోనా రావడంతో డాక్టర్స్ టెస్ట్ లు చెయ్యగా ఆయన ఊపిరితిత్తులలో నిమ్ము [more]
పవన్ కళ్యాణ్ కి కరోనా రావడం తగ్గడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ కి కరోనా రావడంతో డాక్టర్స్ టెస్ట్ లు చెయ్యగా ఆయన ఊపిరితిత్తులలో నిమ్ము [more]
పవన్ కళ్యాణ్ కి కరోనా రావడం తగ్గడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ కి కరోనా రావడంతో డాక్టర్స్ టెస్ట్ లు చెయ్యగా ఆయన ఊపిరితిత్తులలో నిమ్ము ఉండడంతో ఆయనకి ఆక్సిజెన్ కూడా పెట్టారు. అయితే కరోనా తగ్గి నెగెటివ్ వచ్చినా పవన్ కళ్యాణ్ కి లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకపోవడంతో ఆయన ఇంకా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే కరోనా తగ్గి పది రోజులు గడుస్తున్నా పవన్ ఆరోగ్యంలో ఎలాంటి తేడా లేదు. ఆయన ఇంకా ఊపిరితిత్తుల ఇన్ఫెషన్ తోనే బాధపడుతున్నట్లుగా సమాచారం. అందుకే పవన్ కళ్యాణ్ బయటికి రావడం లేదని, అటు రాజకీయాలు, ఇటు సినిమాలని కూడా పవన్ ఆరోగ్య రీత్యా పూర్తిగా పక్కనబెట్టినట్లుగా తెలుస్తుంది.
ఏపీలో కరోనా అల్లకల్లోలం గురించి పవన్ మీడియాతో మాట్లాడాడకపోవడానికి కారణం ఆయన ఆరోగ్యమే అని, లేదంటే జనసేనాని ఈపాటికి జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రెడీ అయ్యేవారని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కి కరోనా సోకడంతో ఆయన నటిస్తున్న హరి హర వీరమల్లు, ఏకే సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. ఇక కరోనా సెకండ్ వేవ్, పవన్ కళ్యాణ్ ఆరోగ్యం దృష్ట్యా ఇప్పట్లో ఆ రెండు సినిమాల షూటింగ్స్ మొదలయ్యే సూచనలు కనిపించడం లేవు. మరో పక్క పవన్ కళ్యాణ్ కి ఎలా ఉందో ఓ ట్వీట్ వేయాలంటూ ఫాన్స్ కోరుతున్నారు. గత నాలుగు రోజులుగా పవన్ ఆరోగ్య విషయాలేమి తెలియడం లేదని వారు ఫీలవుతున్నారు.