గ్యాంగ్ లీడర్ పై రచ్చ

ప్రస్తుతం టాలీవుడ్ లో టైటిల్స్ రగడ నడుస్తుంది. రీసెంట్ గా ముద్ర అనే టైటిల్ పైన వివాదం నడిచింది. ముద్ర అనే టైటిల్ నిఖిల్ తన కొత్త [more]

Update: 2019-03-09 07:17 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో టైటిల్స్ రగడ నడుస్తుంది. రీసెంట్ గా ముద్ర అనే టైటిల్ పైన వివాదం నడిచింది. ముద్ర అనే టైటిల్ నిఖిల్ తన కొత్త సినిమాకి పెట్టుకుంటే ప్రొడ్యూసర్ నట్టి కుమార్ ఆ టైటిల్ నాది మీరు ఎలా పెట్టుకుంటారు అని వివాదంకి దిగారు. దాంతో వెనక్కి తగ్గిన నిఖిల్ టైటిల్ వదులుకుని 'అర్జున్ సురవరం' అంటూ కొత్త టైటిల్ ప్రకటించారు. నిఖిల్ చిన్న హీరో కాబట్టి తగ్గాడు. ఇప్పుడు నాని లాంటి హీరో టైటిల్ విషయం లో తగ్గుతాడా? అంటే చూడాలి.

విక్రమ్ కుమార్ తో నాని ఓ సినిమా చేయనున్నాడు. ఈసినిమాకి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ఫిక్స్ చేసి అధికారంగా ప్రకటించారు మేకర్స్. అయితే ఈ టైటిల్ మేము ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నాం అని చిరంజీవి వీరాభిమాని మాణిక్యం మూవీస్ నిర్మాత అన్నారు. ఆ టైటిల్ తో సినిమా తీస్తున్నాం. ఆరు నెలల క్రితం రిజిస్టర్ చేయించాం…చట్ట విరుద్ధంగా లాక్కోవాలని చూశారు.. ఇస్తే మెగా ఫ్యామిలీకి ఇస్తాం కానీ ఎవరికీ ఇవ్వం!! ససేమిరా అంటున్నారు మాణిక్యం మూవీస్ నిర్మాత అన్నారు. తమ టైటిల్ ను లాక్కున్నారని…ఇస్తే మెగా ఫ్యామిలీకి ఇస్తాం కానీ ఎవరికీ ఇవ్వం అని అంటున్నారు.

ప్రస్తుతం ఈ గొడవ ఫిలింఛాంబర్ సమక్షంలో పరిష్కారం వెతుకుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో గ్యాంగ్ లీడర్ టైటిల్ తో సినిమా నిర్మిస్తామని మాణిక్యం మూవీస్ నిర్మాత అంటున్నారు. 40 రోజులు పాటు గోదావరి జిల్లాల లో షూటింగు ప్లాన్ చేసాం. అన్ని ముగించుకుని చిరంజీవి పుట్టిన రోజు కానుక గా ఆగస్ట్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అని ప్రకటించారు. మరి నాని ఎంతవరకు రెస్పాండ్ అవుతాడో చూడాలి. నాని కూడా నిఖిల్ లా తగ్గి టైటిల్ మార్చుకుంటాడేమో చూద్దాం

Tags:    

Similar News