అనసూయా…. నిన్ను వదలా

బుల్లితెర మీద వెలుగుతున్న అనసూయ కి దర్శకుడు సుకుమార్ రంగస్థలం లో రంగమ్మత్త పాత్ర నిచ్చి బాగా హైలెట్ చేశాడు. ఆ రంగమ్మత్త పాత్రలో అనసూయ వెండితెర [more]

Update: 2019-09-25 06:26 GMT

బుల్లితెర మీద వెలుగుతున్న అనసూయ కి దర్శకుడు సుకుమార్ రంగస్థలం లో రంగమ్మత్త పాత్ర నిచ్చి బాగా హైలెట్ చేశాడు. ఆ రంగమ్మత్త పాత్రలో అనసూయ వెండితెర మీద సెటిల్ అయ్యింది. రంగస్థలం కన్నా ముందు క్షణం, సోగ్గాడే చిన్నినాయనా సినిమాలు చేసిన అనసూయ తర్వాత విన్నర్ లో ఐటెం సాంగ్ తో అదరగొట్టేసింది. హీరోయిన్స్ తో పోటీపడి మరీ హాట్ ఫోటో షూట్స్ చేయించుకునే అనసూయ కి చిరు – కొరటాల సినిమాలోనూ ఓ భారీ అవకాశం వచ్చింది. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతుంది.

ఆమె కోసం ఫుల్ లెన్త్ క్యారెక్టర్…..

తాజాగా అనసూయ కి సుకుమార్ మరో మంచి పాత్ర ఇవ్వబోతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో అనసూయకి ఓ మంచి పాత్ర ని సుకుమార్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. స్క్రిప్ట్ దశలోనే క్యారెక్టర్స్‌కు ఆర్టిస్టులను కూడా ఎంపిక చేసుకునే సుకుమార్… అనసూయ కోసం ఓ మంచి ఫుల్ లెన్త్ క్యారెక్టర్‌ను ఫిక్స్ చేశాడని టాక్. ఇప్పటికే వెండితెర మీద అవకాశాల మీద అవకాశాలతో ఉన్న అనసూయ ఇప్పుడు సుకుమార్ సినిమా కోసం డేట్స్ ని అడ్జెస్ట్ చేసుకునే పనిలో పడిందనే టాక్ వినబడుతుంది.

 

Tags:    

Similar News