నరేష్ - పవిత్ర పెళ్లి
సినీ నటుడు నరేష్, పవిత్రలు పెళ్లి చేసుకున్నారు. సన్నిహితుల సమక్షంలో వారు వివాహం చేసుకున్నారు
సినీ నటుడు నరేష్, పవిత్రలు పెళ్లి చేసుకున్నారు. సన్నిహితుల సమక్షంలో వారు వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో తమ పెళ్లి వీడియోను నరేష్ విడుదల చేశారు. అతి కొద్ది మంది ఈ వివాహానికి హాజరయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహమయింది.
సహజీవనం చేస్తూ...
గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న వీరు అధికారికంగా దంపతులుగా మారారు. నరేష్ కు ఇది నాలుగో పెళ్లి కాగా, పవిత్రకు కూడా మరో వివాహం. ఇద్దరూ ఒక్కటయ్యామని అధికారికంగా వారు వీడియోను విడుదల చేశారు. ఇప్పటి వరకూ వస్తున్న వదంతులకు వారిద్దరూ అధికారికంగా చెక్ పెట్టినట్లయింది. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, ఏడడుగు, మూడు ముళ్లు అంటూ నరేష్ ట్వీట్ చేశారు. అయితే పెళ్లి ఎక్కడ జరిగిందన్నది తెలియరాలేదు. కానీ తన మూడో భార్య రమ్య నుంచి నరేష్ విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది.