మంచు ఫ్యామిలీలో కుదుపు
ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ తన భార్యతో వేరుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తాము ఎవరికివారే జీవించాలని నిర్ణయించుకున్నామని మనోజ్ ట్వీట్ చేశాడు. తాము వేరుగా [more]
ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ తన భార్యతో వేరుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తాము ఎవరికివారే జీవించాలని నిర్ణయించుకున్నామని మనోజ్ ట్వీట్ చేశాడు. తాము వేరుగా [more]
ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ తన భార్యతో వేరుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తాము ఎవరికివారే జీవించాలని నిర్ణయించుకున్నామని మనోజ్ ట్వీట్ చేశాడు. తాము వేరుగా ఉంటేకూడా ఇద్దరం ఒకరినొకరం గౌరవించుకుంటామని మనోజ్ చెప్పాడు. ఈ విషయం చెప్పడానికి తాను ఎంతో బాధపడుతున్నానని చెప్పాడు. భేదాభిప్రాయాల కారణంగా చాలా బాధను అనుభవించానని, అన్ని రకాలుగా ఆలోచించి, ఎంతో ఆత్మశోధన తర్వాత విడిపోయి ఎవరికివారే జీవించాలని నిర్ణయించుకున్నామని మంచు మనోజ్ వివరించాడు. కొంతకాలంగా నా మనసు మనసులో లేకపోవడంతో నటనపై దృష్టి పెట్టలేకపోయానని, పనిపై ఏకాగ్రత చూపలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు మళ్లీ మీ ముందుకు వస్తున్నా. మళ్లీ రంగంలోకి దిగుతున్నా. మీరు సిద్ధంగా ఉండండి. ఇక రాక్ అండ్ రోలే అంటూ ముగించాడు.