ఓటీటీలోకి "ఫస్ట్ డే ఫస్ట్ షో".. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన "ఆహా"

జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్.. ఈ సినిమాతో అసోసియేట్ అవడంతో.. ఇది కూడా హిట్ అవుతుందనుకున్నారు. కానీ..

Update: 2022-09-15 11:34 GMT

కరోనా తర్వాత.. సినీ ఇండస్ట్రీకి మంచికాలం రావడానికి చాలా సమయం పట్టింది. 50 శాతం ఆక్యుపెన్సీ నుంచి 100 శాతానికి వచ్చేందుకు చాలా రోజుల సమయం పట్టింది. పెద్ద సినిమాలతో పాటు చిన్న చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. కానీ.. చిన్న సినిమాలు ఎక్కువరోజులు థియేటర్లలో ఆడటం లేదు. కథలో బలం లేకపోవడం, ఆ తర్వాతి వారం పెద్దసినిమాలు రావటం.. రకరకాల కారణాలున్నాయి. వెంటనే ఓటీటీ బాటపడుతున్నాయి. తాజాగా విడుదలైన "ఫస్ట్ డే ఫస్ట్ షో" సినిమా కూడా అప్పుడే ఓటీటీలోకి రానుంది.

జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్.. ఈ సినిమాతో అసోసియేట్ అవడంతో.. ఇది కూడా హిట్ అవుతుందనుకున్నారు. కానీ.. ఆడియన్స్ ను ఆకట్టుకోవడంతో "ఫస్ట్ డే ఫస్ట్ షో" విఫలమైంది. తాజాగా.. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో ఓ యువకుడు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు సొంతం చేసుకునేందుకు ఎలాంటి పాట్లు పడ్డాడు అనేది సినిమా కథగా మనకు చూపించనున్నారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 23నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనుంది.


Tags:    

Similar News