ఫ్రైడే టెంక్షన్ అంటుంది!!
హీరోయిన్స్ చాలామంది కెరీర్ ఆరంభించిన కొత్తల్లో తాము నటించిన సినిమా విడుదలవుతుంది అంటే ఆ రాత్రి వాళ్ళకి నిద్రపట్టదు. తమ సినిమా హిట్ అయితే తర్వాత మంచి [more]
హీరోయిన్స్ చాలామంది కెరీర్ ఆరంభించిన కొత్తల్లో తాము నటించిన సినిమా విడుదలవుతుంది అంటే ఆ రాత్రి వాళ్ళకి నిద్రపట్టదు. తమ సినిమా హిట్ అయితే తర్వాత మంచి [more]
హీరోయిన్స్ చాలామంది కెరీర్ ఆరంభించిన కొత్తల్లో తాము నటించిన సినిమా విడుదలవుతుంది అంటే ఆ రాత్రి వాళ్ళకి నిద్రపట్టదు. తమ సినిమా హిట్ అయితే తర్వాత మంచి అవకాశాలు వస్తాయి. లేదంటే హీరోయిన్స్ కెరీర్ గల్లంతే. అందుకే వారికీ సినిమాల విడుదల అంటే యమా టెంక్షన్. తాజాగా టాప్ హీరోయిన్ పూజ హెగ్డే కూడా అదే చెబుతుంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఫ్రైడే వస్తుంది అంటే చాలా భయపడేదట. సినిమాల్లోకి వహ్చిన కొత్తల్లో నటీనటులు ఎవవరికైనా ఒత్తిడి ఉంటుంది అని.. శుక్రవారం వస్తుంది అంటే తెలియని టెంక్షన్ ఫీలవుతారని చెబుతుంది. ఎందుకంటే సినిమా వాళ్ళ జాతకాలూ ముడి పడి ఉండేది ఆ శుక్రవారంతోనే అని చెబుతుంది పూజ హెగ్డే.
అందరిలాగే పూజ హెగ్డే కూడా శుక్రవారం అంటే భయపడేదట. తన సినిమా విడుదలవుతుంది అంటే అందరిలాగే నేను ఉత్కంఠగా ఎదురు చూస్తుంటాను. ముందు రోజు నిద్ర కూడా పట్టేది కాదు. ఎవరి నుండి ఏం ఫోన్ వస్తుంది, ఎవరేం చెబుతారో అనే తెగ టెంక్షన్ ఫీలయ్యేదట. కానీ ఇప్పుడు అంత టెంక్షన్ పడడం లేదట. ఏం జరిగిఆన్ మన మంచికే అనే పాజిటివ్ నెస్ తో ఆలోచించడం మొదలు పెట్టాను అని చెబుతుంది. అంతేకాకుండా తానూ ఎంచుకున్న పాత్ర కోసం 100 శాతం కష్టపడతాను అని చెబుతుంది పూజ హెగ్డే. ఇక మిగతాది ప్రేక్షకులే చూసుకుంటారు. హిట్ అయితే కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అని అనుకుంటాను అంటూ ఫ్రైడే టెక్షన్ గురించి చెబుతుంది పూజ.