వాల్మీకి అక్కడ కష్టమే
తెలుగు రాష్ట్రాల్లో దమ్ము లేపుతున్న గద్దల కొండ గణేష్ చిత్రాన్ని సెలెబ్రెటీస్ సైతం మెచ్చుకుంటున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు, చిరంజీవి ఈ సినిమాను చూసి ప్రశంసల [more]
తెలుగు రాష్ట్రాల్లో దమ్ము లేపుతున్న గద్దల కొండ గణేష్ చిత్రాన్ని సెలెబ్రెటీస్ సైతం మెచ్చుకుంటున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు, చిరంజీవి ఈ సినిమాను చూసి ప్రశంసల [more]
తెలుగు రాష్ట్రాల్లో దమ్ము లేపుతున్న గద్దల కొండ గణేష్ చిత్రాన్ని సెలెబ్రెటీస్ సైతం మెచ్చుకుంటున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు, చిరంజీవి ఈ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించారు. కలెక్షన్స్ పరంగా ఈమూవీ స్ట్రాంగ్ గా ఉంది. రెండు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ గా ఉన్న ఈ మూవీ ఎక్కువ బి,సి సెంటర్స్ లో బాగా ఆడుతుంది. ఇస్మార్ట్ శంకర్ తరువాత అంత మాస్ ఇమేజ్ ఉన్న సినిమా రావడంతో మాస్ ప్రేక్షకులు ఈమూవీకి బాగా కనెక్ట్ అవుతున్నారు.
అమెరికాలో తగ్గిన క్రేజ్
ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా బాగా డ్రాప్ అయింది. అమెరికాలో ఈమూవీ ఇప్పటివరకు హాఫ్ మిలియన్ మార్క్ ని కూడా రీచ్ కాలేదు. నిజానికి వరుణ్ తేజ్ కి అమెరికా లో మంచి మార్కెట్ ఉంది. అతని గత చిత్రాలు ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2 చిత్రాలు అక్కడ సూపర్ హిట్ అయ్యి మంచి వసూళ్లు చేశాయి. కానీ వాల్మీకి మాత్రం అక్కడ వర్కవుట్ అవ్వలేదు.అక్కడ ఈమూవీ ని రూ. 2.5 కోట్లకు అమ్మారు. ఇందులో కొంతవరకు రికవరీ అయ్యే అవకాశముంది కానీ మిగిలిన అమౌంట్ కష్టమే అంటున్నారు ట్రేడ్ వారు. సో ఈసినిమా ను అమెరికా లో కొన్న డిస్ట్రిబ్యూటర్ కి నష్టాలు తప్పవు.