నాని అక్కడ కొంచెం కష్టపడాల్సివస్తుందా

నాని – విక్రమ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్ కి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పరంగా పర్లేదు అనిపించుకుంది. [more]

Update: 2019-09-19 08:09 GMT

నాని – విక్రమ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్ కి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పరంగా పర్లేదు అనిపించుకుంది. ఇక ఓవర్సీస్ లో నాని కి మంచి మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీకి 200,132 డాలర్లు వస్తే శుక్రవారం 149,031 డాలర్లు వచ్చాయి.

మిలియన్ మార్క్ దాటాలంటే….

ఇక శనివారం చూసుకుంటే 257,270 డాలర్లతో పుంజుకుంది. దాంతో శనివారం నాటికి మొత్తంగా 600,000 డాలర్లకు చేరుకుంది. ఇక ఆదివారం కొంచెం తగ్గింది. 130,860 డాలర్లు మాత్రమే వసూళ్లు చేసింది. ఇక వీక్ డేస్ అయిన సోమవారం అండ్ మంగళవారం లో కలెక్షన్స్ బాగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం వరకు ఈ మూవీ మొత్తంగా 821,607 డాలర్ల వరకే చేరుకుంది. దీంతో ఈమూవీ మిలియన్ మార్క్ అందుకోవడానికి కష్టపడాల్సిన పరిస్థితి. చూడాలి ఈ రెండు రోజుల్లో ఏమన్నా వసూళ్లు చేస్తుందో ఏమో అని. అసలే ఈ వీక్ వరుణ్ తేజ్ వాల్మీకి వస్తుంది.

 

Tags:    

Similar News