"గని" కొత్త రిలీజ్ డేట్ ఇదే !

"గని" సినిమాను ఎప్పుడు విడుదల చేయాలన్నా ఏదొక ఆటంకం వస్తోంది. ఈ సారి మరో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.

Update: 2022-03-02 13:26 GMT

హైదరాబాద్ : బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన సినిమా "గని". అల్లు బాబీ - సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. మొదట ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయాలని భావించారు. కానీ.. ఆ రోజు భీమ్లా నాయక్ విడుదల ఉండటంతో మార్చి 4కి వాయిదా వేశారు. 25న విడుదల కావాల్సిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా మార్చి 4న రిలీజ్ అయ్యేందుకు ఫిక్స్ అయింది. దానితో పాటు సెబాస్టియన్ కూడా విడుదలవుతోంది.

"గని" సినిమాను ఎప్పుడు విడుదల చేయాలన్నా ఏదొక ఆటంకం వస్తోంది. ఈ సారి మరో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చెప్తూ.. అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. గని లో వరుణ్ సరసన సయీ మంజ్రేకర్ పరిచయం కానుంది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కనిపించనున్నారు. తమన్ అందిస్తున్న సంగీతం.. సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.






Tags:    

Similar News