మా డబ్బు మాకు ఇవ్వండి!!

ప్రస్తుతం కరోనా తో థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితులు లేవు. దానితో చాలా సినిమాలు ఓటిటి వైపు పరుగులు తీస్తున్నాయి. అయితే విడుదలకు దగ్గరగా వచ్చి వాయిదా [more]

Update: 2020-07-02 05:38 GMT

ప్రస్తుతం కరోనా తో థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితులు లేవు. దానితో చాలా సినిమాలు ఓటిటి వైపు పరుగులు తీస్తున్నాయి. అయితే విడుదలకు దగ్గరగా వచ్చి వాయిదా పడిన సినిమాల పరిస్థితి మాత్రమే కాదు.. సెట్స్ మీదున్నప్పుడే కొన్ని సినిమాలకున్న క్రేజ్ తో మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగింది. వాటిలో కొన్ని సినిమాల ను కొన్న బయ్యర్లు ఇప్పుడప్పుడే సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేలా లేవు.. సో మేము కట్టిన అడ్వాన్స్ లు తిరిగి ఇవ్వమని నిర్మాతలను కోరుతున్నారట.

అందులో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ థియేటర్స్ బయ్యర్లు కూడా ఉన్నారని తెలుస్తుంది. ఫిదా క్రేజ్ తో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీపై మంచి అంచనాలున్నాయి. సాయి పల్లవి హీరోయిన్ కావడం, సినిమా సాంగ్ విపరీతంగా మార్కెట్ లో హల్చల్ చెయ్యడంతో.. ఈ సినిమాకి మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగింది. శేఖర్ కమ్ముల మీదున్న క్రేజ్ తో లవ్ స్టోరీ ఓవర్సీస్ రైట్స్  భారీ ధరకు అమ్ముడయ్యాయి. శాటిలైట్ రైట్స్‌ని ప్రముఖ ఛానల్‌కు భారీ ధరకు దక్కించుకోగా.. మొత్తంగా లవ్ స్టోరీ చిత్రానికి శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ హక్కులు అన్నీ కలుపుకుని రూ. 18 కోట్లకు వరకూ రేటు పలికినట్టు తెలుస్తోంది. మరి క్రేజున్న సినిమా గనక బయ్యర్లు కూడా ఎగబడి థియేట్రికల్ రైట్స్ కొనేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో చెప్పలేము, అసలు వస్తుందా అనేది నమ్మకం లేదు.. కాబట్టి మా అడ్వాన్స్ లు మాకివ్వండి అంటూ లవ్ స్టోరీ నిర్మాతపై బయ్యర్లు ఒత్తిడి పెంచుతున్నారట.

Tags:    

Similar News