హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న జయప్రద
సినీనటి, మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెకు చెన్నై ఎగ్మోర్ లోని
సినీనటి, మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెకు చెన్నై ఎగ్మోర్ లోని ట్రయల్ కోర్టు విధించిన 6 నెలల జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించింది. చెన్నైలో జయప్రద ఒక సినిమా థియేటర్ ను నిర్వహించారు. థియేటర్ కు నష్టాలు రావడంతో దాన్ని మూసివేశారు. అయితే, తమకు ఈఎస్ఐ డబ్బులు ఇవ్వలేదంటూ థియేటర్ కార్మికులు ఎగ్మోర్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో జయప్రదకు ట్రయల్ కోర్టు శిక్షను విధించింది. ట్రయల్ కోర్టు తీర్పును జయప్రద మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జయప్రద పిటిషన్ పై తదుపరి విచారణ ముగిసేంత వరకు శిక్షపై స్టే విధిస్తున్నట్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రామ్‌కుమార్, రాజ్‌బాబులతో కలిసి జయప్రద చెన్నైలో ఓ థియేటర్ నిర్వహించారు. ఆ సమయంలో సిబ్బందికి ఈఎస్ఐ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలైంది. ఈ క్రమంలో న్యాయస్థానం జయప్రదతో సహా ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఆగస్టులో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ జయప్రద హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. అక్కడ కూడా ఎదురుదెబ్బ తగలడంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు.