సినిమా లవర్స్ కు గుడ్ న్యూస్.. తగ్గిన టికెట్ ధరలు !
టాలీవుడ్ నిర్మాతలు సినిమా థియేటర్లలో టికెట్ల రేట్లను పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థన
ఏపీలో టికెట్ ధరలను తగ్గించిన వెంటనే.. టాలీవుడ్ నిర్మాతలు సినిమా థియేటర్లలో టికెట్ల రేట్లను పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థన మేరకే రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను పెంచింది. కానీ.. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి భారీ బడ్జెట్ సినిమాల విడుదలలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలయ్యేందుకు క్యూ కట్టాయి. కానీ.. పెరిగిన టికెట్ల రేట్లను చూసి ఇంతపెద్దమొత్తం ఖర్చు చేసి.. ఈ సినిమాలను చూడాలా అని చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ లు మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పాయి. ఎక్కువమంది ప్రేక్షకులను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లు టికెట్ ధరలను సవరించాయి. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు థియేటర్లలో టికెట్ ధరలు రూ.200, రూ.175, రూ.150గా ఉంటాయి. ఇప్పటి నుంచి కొత్తగా విడుదలయ్యే సినిమాలకు ఈ రేట్లు వర్తిస్తాయి. ఈ ఏడాది సంక్రాంతి బరి నుంచి పెద్ద సినిమాలన్నీ తప్పుకోగా.. బంగార్రాజు, రౌడీ బాయ్స్, డీజే టిల్లు, సూపర్ మచ్చి, హీరో వంటి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.