ఫ్లాప్ డైరెక్టర్ తో ఫ్లాప్ హీరో
డైరెక్టర్ గారు దశాబ్దంన్నర తర్వాత నేనే రాజు నేనే మంత్రి తో హిట్ అందుకున్నాడు. ప్రేక్షకులు కూడా తేజ ఇటువంటి సినిమాలు తీస్తాడా అని ఆశర్యపోయారు. కానీ [more]
డైరెక్టర్ గారు దశాబ్దంన్నర తర్వాత నేనే రాజు నేనే మంత్రి తో హిట్ అందుకున్నాడు. ప్రేక్షకులు కూడా తేజ ఇటువంటి సినిమాలు తీస్తాడా అని ఆశర్యపోయారు. కానీ [more]
డైరెక్టర్ గారు దశాబ్దంన్నర తర్వాత నేనే రాజు నేనే మంత్రి తో హిట్ అందుకున్నాడు. ప్రేక్షకులు కూడా తేజ ఇటువంటి సినిమాలు తీస్తాడా అని ఆశర్యపోయారు. కానీ ఆనందం ఎక్కువ సేపు ఉంచలేదు తేజ. తన తరువాత సినిమా సీత తో మళ్లీ బ్యాక్ టూ డీ-ఫామ్ అన్నట్టు చేసాడు. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో తేజ తో సినిమా చేయడానికి ఏ హీరో ముందు రావడం లేదు. కానీ తేజ ఒక ఫ్లాప్ హీరోను నమ్ముకున్నట్లుగా వార్తలొస్తున్నాయి.
ఆయన ఎవరో కాదు. హీరో గోపీచంద్. అటు గోపీచంద్ కి కూడా హిట్ అనే మాట విని చాలా ఏళ్ళు అయింది. ప్రస్తుతం ఈయన ‘చాణక్య’ సినిమాతో పలకరించబోతున్నాడు. ఈమూవీ తరువాత తేజ సినిమా చేయనున్నాడు గోపి. తాజా సమాచారం ప్రకారం తేజ చెప్పిన ఓ కథకు కూడా అతను ఓకే చెప్పాడట. అసలే ఫ్లాప్ లో ఉన్న తేజ కి గోపి ఎలా ఛాన్స్ ఇచ్చాడు అంటే తేజ విషయంలో గోపీలో కృతజ్ఞతా భావం ఉంది.
గోపీచంద్ తొలి సినిమా ‘తొలి వలపు’తో హీరోగా దారుణమైన ఎదురు దెబ్బ తిన్న సమయంలో అతడిని విలన్ గా మార్చి జయం సినిమా సక్సెస్ అందించాడు. గోపీచంద్ కి ఆ సినిమాతో పెద్ద పేరు వచ్చింది. అలా విలన్ గా రెండుమూడు సినిమాలు చేసిన తరువాత ‘యజ్ఞం’ తో మళ్లీ హీరోగా మారాడు. అక్కడ నుండి అతనికి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అందుకే తన కెరీర్ ని ఒక గాడి లో పెట్టిన తేజ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు గోపి.