పవన్ హరిహర వీరమల్లుగా.!

పవన్ కళ్యాణ్ అన్నకూతురు నిహారిక పెళ్లి చూసుకుని రైతుల కోసం ఏపీ ప్రభుత్వంతో తలపడుతూనే  వకీల్ సాబ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. వకీల్ సాబ్ షూటింగ్ ని [more]

Update: 2020-12-12 05:01 GMT

పవన్ కళ్యాణ్ అన్నకూతురు నిహారిక పెళ్లి చూసుకుని రైతుల కోసం ఏపీ ప్రభుత్వంతో తలపడుతూనే వకీల్ సాబ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. వకీల్ సాబ్ షూటింగ్ ని పూర్తి చేసుకోబోతున్న పవన్ కళ్యాణ్ డిసెంబర్ మూడో వారంలో క్రిష్ సినిమా సెట్స్ లోకి రాబోతున్నాడనే న్యూస్ ఉంది. క్రిష్ – పవన్ కళ్యాణ్ కాంబో మూవీ పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ – పవన్ కాంబో మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే అది క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే పవన్ – క్రిష్ మూవీకి సంబందించిన ఫస్ట్ షెడ్యూల్ ని అల్యుమినియం ఫ్యాక్టరీలో వేసిన ఓ సెట్ లో కంప్లీట్ చేసారు.

పవన్ ని దొంగగా చూపించబోతున్న క్రిష్.. పవన్ కళ్యాణ్ సినిమాకి ఎలాంటి టైటిల్ పెడతాడో అనే ఉత్సుకత పవన్ ఫాన్స్ కి మాత్రమే కాదు.. అందరిలోనూ ఉంది. క్రిష్ సినిమా టైటిల్స్ చాలా డిఫ్రెంట్ గాను కొత్తగానూ అనిపిస్తాయి. అయితే క్రిష్ – పవన్ కాంబో మూవీకి గజ దొంగ, విరూపాక్ష, ఓం శివమ్ అనే టైటిల్స్ లో ఏదో ఒకటి పెట్టబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే తాజాగా క్రిష్ పవన్ కోసం ఓ టైటిల్ ఫిక్స్ చేసాడని.. అది కథకి పర్ఫెక్ట్ గా సరిపోతుందని అంటున్నారు. మరి క్రిష్ – పవన్ టైటిల్ ఏమంటే ‘హరిహర వీరమల్లు’ అంటూ ఓ కొత్త టైటిల్ సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చింది. క్రిష్ రాసుకున్న కథకి, పవన్ కేరెక్టర్ కి ఈ  టైటిల్ సరిగ్గా సరిపోతుంది అని.. అందుకే క్రిష్ ఈ టైటిల్ ని ఫిక్స్ చేసాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది.

Tags:    

Similar News