అల్లు అర్జున్ తో “దువ్వాడ జగన్నాధం” సినిమా తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంత వరకు ఒక్క సినిమా కూడా ఓకే చేయలేదు. వసూళ్లపరంగా ఈ మూవీ పర్లేదు అనిపించుకుంది కానీ క్రిటిక్స్ పరంగా ఫెయిల్ అయింది. దీంతో హరీష్ తన నెక్స్ట్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. దిల్ రాజు కాంపౌండ్ లో స్టోరీల మీద స్టోరీలు రాస్తున్నాడు. కానీ దిల్ రాజు... హరీష్ చెప్పే లైన్స్ కి సాటిస్ఫై అవ్వకపోవడంతో సేఫ్ గా తమిళంలో హిట్ అయిన “జిగర్తాండ”ని రీమేక్ కి ప్లాన్ చేస్తున్నాడు. ఎప్పటి నుండో ఈ సినిమాకు సంబంధించి తెలుగు నేటివిటీకి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకుంటున్నాడు. ఇందులో ఆల్రెడీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ లో నటించడానికి ఒప్పుకున్నాడు.
ఇద్దరిలో ఎవరో మరి...
అయితే ఇందులో మరో హీరోకి కూడా ఛాన్స్ ఉంది. మాతృకతలో సిద్దార్థ్ ప్లే చేసిన రోల్ ని నాగశౌర్య లేదా రాజ్ తరుణ్ తో చేయిద్దాం అని హరీష్ శంకర్ ప్లాన్. అయితే హరీష్ కు ఇక్కడే ఓ పెద్ద సమస్య వచ్చింది. ఆ రోల్ కి ఇద్దరు సెట్ అయ్యేలా ఉండడంతో ఎవరిని తీసుకోవాలో అర్ధం కావట్లేదు. అందుకే ఇద్దరికీ ఒక వర్క్ షాప్ పెట్టి ఇద్దరిలో ఒకర్ని సెలెక్ట్ చేయాలి హరీష్ భావిస్తున్నాడట. మరి ఈ ఇద్దరిలో ఎవరు సెలెక్ట్ అవుతారో చూడాలి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫ్రిబ్రవరిలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సినిమాకు సంబంధించి మిగిలిన డీటెయిల్స్ త్వరలోనే తెలియనున్నాయి.