హరీష్ శంకర్ అలిగాడు
డైరెక్టర్ హరీష్ శంకర్ మేకింగ్ ఎంత స్టైలిష్ గా ఉంటుందో మనం చూసే ఉంటాం. తన సినిమాల్లో హీరో ని, విలన్ ని ఎంత బాగా చూపిస్తారో [more]
;
డైరెక్టర్ హరీష్ శంకర్ మేకింగ్ ఎంత స్టైలిష్ గా ఉంటుందో మనం చూసే ఉంటాం. తన సినిమాల్లో హీరో ని, విలన్ ని ఎంత బాగా చూపిస్తారో [more]
డైరెక్టర్ హరీష్ శంకర్ మేకింగ్ ఎంత స్టైలిష్ గా ఉంటుందో మనం చూసే ఉంటాం. తన సినిమాల్లో హీరో ని, విలన్ ని ఎంత బాగా చూపిస్తారో తన గత సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది. హరీష్ శంకర్ కొంచం సెన్సటివ్ అని బాగా కోపం ఎక్కువ అని ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
హరీష్ శంకర్ ప్రస్తుతం వరుణ్ తేజ్ తో వాల్మీకి సినిమా తీస్తున్నారు. ఈసినిమా షూటింగ్ టైములో కూడా వివాదాలు తప్పడం లేదు హరీష్ శంకర్ కి. షూటింగ్ టైములో ప్రొడక్షన్ యూనిట్ జనాలతో వాదనో? ఘర్షణో? తలెత్తినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఓ విషయంలో పీఆర్ టీమ్ జనాలను ట్విట్టర్ లో అన్ ఫాలో చేసినట్లు వినిపిస్తోంది. కారణం ఓ విషయంలో హీరోకు అభిప్రాయానికి మద్దతుగా నిలిచారని, తనవైపు వుండలేదని హరీష్ అలిగారు అని తెలుస్తుంది.
హరీష్ శంకర్ ఇలా చేయడం కామన్ నే అని అతను మళ్లీ మనసు మార్చుకుని, మామూలు అవుతారని, ఇండస్ట్రీ జనాల్లో వినిపిస్తోంది. ఇక వాల్మీకి సినిమా సెప్టెంబర్ 13 న రిలీజ్ కి రెడీ అవుతుంది.