Maa : లోకేష్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసినా బాలయ్య మద్దతిచ్చారు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా చలన చిత్ర పరిశ్రమలో ఇంకా వేడి తగ్గలేదు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామా [more]
;
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా చలన చిత్ర పరిశ్రమలో ఇంకా వేడి తగ్గలేదు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామా [more]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా చలన చిత్ర పరిశ్రమలో ఇంకా వేడి తగ్గలేదు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలపై మా అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తాజాగా బాలకృష్ణ ఇంటికి మోహన్ బాబు, మంచు విష్ణు వచ్చారు. బాలకృష్ణతో సమావేశమయ్యారు. ఎన్నికలకు ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాలను మోహన్ బాబు బాలకృష్ణకు వివరించినట్లు తెలిసింది. అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ తాను బాలయ్యను కలిసింది వ్యక్తిగత కారణాలతోనే అని చెప్పారు. 2019 ఎన్నికల్లో బాలయ్య అల్లుడు లోకేష్ కు వ్యతిరేకంగా తాను ప్రచారం చేశానని, కానీ బాలకృష్ణ మా ఎన్నికల్లో విష్ణును ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకే వచ్చానని చెప్పారు.
రెండు వర్గాలుగా….
మొన్న జరిగిన మా ఎన్నికల్లో చిత్ర పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయింది. చిరంజీవి, మోహన్ బాబుల వర్గం అనేకన్నా రెండు కులాలుగా విడిపోయింది. దీంతో మోహన్ బాబు నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిసింది. బాలకృష్ణతో పాటు మిగిలిన అగ్రనటులు చిరంజీవి, నాగార్జునలను కూడా కలిసే అవకాశముందని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామాల విషయంలో వీరి సూచనలను తీసుకోనున్నారు.