అంత గ్లామర్ పెట్టుకుని ఎందుకిలా అయ్యావ్!!
హెబ్బా పటేల్ కుమారి 21 f కన్నా ముందే ఓ డీసెంట్ సినిమా లో డీసెంట్ గా నటించింది. కానీ ఆ సినేమాకి రాని పేరు కుమార్ [more]
హెబ్బా పటేల్ కుమారి 21 f కన్నా ముందే ఓ డీసెంట్ సినిమా లో డీసెంట్ గా నటించింది. కానీ ఆ సినేమాకి రాని పేరు కుమార్ [more]
హెబ్బా పటేల్ కుమారి 21 f కన్నా ముందే ఓ డీసెంట్ సినిమా లో డీసెంట్ గా నటించింది. కానీ ఆ సినేమాకి రాని పేరు కుమార్ 21 f లో బోల్డ్ గా నటించేసరికి వచ్చేసింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ తో సినిమాలు చేసిన హెబ్బా పటేల్ కి సరైన బ్రేక్ రాలేదు. గ్లామర్ గర్ల్ గా సోషల్ మీడియాలో ఎన్ని పాట్లు పడినా హెబ్బా పటేల్ కి సరైన అవకాశం రావడం లేదు. అందుకే తన కెరీర్ ఎక్కడ ముగిసిపోతుందో అనుకున్న హెబ్బా పటేల్ హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్స్ కి పరిమితమవుతుంది. పోనీ ఆ రోల్స్ కి ప్రాధాన్యత ఉందా అంటే అది లేదు. గతంలో నితిన్ భీష్మలో హెబ్బా కనిపించిన ఉపయోగం లేదు.
తాజాగా ఒరేయ్ బుజ్జిగా సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేసింది. అసలు సినిమానే హిట్ అవనప్పుడు హెబ్బా రోల్ కి ఏం పేరొస్తుంది. ఉన్న కాసేఫు నవ్వించినా హెబ్బా పటేల్ ఉన్న విషయం బయట ఎవరు మాట్లాడడం లేదు. ఇలాంటి సిల్లీ పాత్రలకి కమిట్ అయ్యి ఫెడవుట్ కి దగ్గరపడింది. అసలు ఒరేయ్ బుజ్జిగా సినిమాలో హెబ్బా పాత్రకి చిన్నపాటి ప్రాధాన్యత కూడా లేదు. పెర్ఫామెన్స్ కు అంతగా స్కోప్ లేదు. మరి గ్లామర్ గా, హాట్ గా ఎక్సపోజింగ్ కి రెడీ అయినా పాపని పట్టించుకునే నాధుడు లేకే హెబ్బా పటేల్ ఇలాంటి చిన్న చితక రోల్స్ కి పరిమితమవుతుంది. మరి సంపత్ నంది రైటింగ్ లో తెరకెక్కుతున్న ఓదెల రైల్వే స్టేషన్ అయినా హెబ్బకి బ్రేకిస్తుందేమో చూడాలి.