నానికి మహాభారతంతో సంబంధమేంటి..?

నాచురల్ స్టార్ నాని గత కొన్ని సినిమాల నుండి వైవిధ్యాన్ని చూపిస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా నాని జెర్సీ అనే ఎమోషనల్ హిట్ తో సక్సెస్ అయ్యాడు. [more]

Update: 2019-05-24 10:32 GMT

నాచురల్ స్టార్ నాని గత కొన్ని సినిమాల నుండి వైవిధ్యాన్ని చూపిస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా నాని జెర్సీ అనే ఎమోషనల్ హిట్ తో సక్సెస్ అయ్యాడు. నాని త్వరలో తనకి లైఫ్ ఇచ్చిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో ఓ వైవిధ్యమైన కథాంశంతో సాగే సినిమాలో నటించనున్నాడు. ఇందులో నాని విలన్ పాత్రలో కనిపించనున్నాడని వార్తలు గత కొన్ని రోజుల నుండి వైరల్ అవుతున్నాయి.

కర్ణుడి లాంటి పాత్ర

అయితే అందులో నిజం లేకపోలేదు. మహాభారతంలో స్నేహధర్మం కోసం అధర్మం అని తెలిసినా దుర్యోధనుడి పక్షం నిలిచిన కర్ణుడిని పాత్రను పోలి ఉంటుందంట నాని పాత్ర. ఇక ఇందులో మరో పాత్ర కోసం సుధీర్ నటిస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం నాని.. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఇది కూడా ఓ వైవిధ్యమైన సినిమానే. దీనికి ‘గ్యాంగ్ లీడర్’ అనే పేరు పెట్టారు.

Tags:    

Similar News