Nandamuri Balakrishna : బాలయ్య అభిమానులకు సూపర్ న్యూస్.. త్వరలో సెట్ మీదకు

నందమూరి అభిమానులకు సూపర్ న్యూస్ చెప్పాడు బాలయ్య.;

Update: 2025-03-31 07:37 GMT
balakrishna, nandamuri fans,  super news, tolywood
  • whatsapp icon

నందమూరి అభిమానులకు సూపర్ న్యూస్ చెప్పాడు బాలయ్య. ఆదిత్య 369 సీక్వెల్ సిద్ధమవుతుందని, త్వరలోనే షూటింగ్ మొదలుపెడతామని తెలిపారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 34 ఏళ్ల క్రితం విడుదలయిన ఆదిత్య 369 అప్పట్లో టాలీవుడ్ ను షేక్ చేసింది. అప్పటి వరకూ మూసలో నడిచే మూవీల నుంచి ఫాంటసీ మూవీలవైపు ప్రేక్షకులను ఈ చిత్రం తనతో పాటు తీసుకెళుతుంది. ఆ మూవీ చేస్తున్నంత సేపు మూడు యుగాల్లో సంచరించి వచ్చినట్లు ఫీలింగ్స్ ను నాడు డైరెక్టర్ తెప్పించి ఫుల్లు సక్సెస్ అయ్యారంటే అతిశయోక్తి కాదు.

ఎన్ని హిట్లున్నా...
నిజానికి నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఎన్నో హిట్స్ ఉన్నప్పటికీ ఆదిత్య 369 మాత్రం వైవిధ్యభరితమైన మూవీ అని చెప్పకతప్పదు. ఆ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకుల నోళ్లలో నేటికీ నానుతుంటాయి. జాణవులే.. నెరజాణవులే... పాట నుంచి ప్రతి పాటా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీ తీయాలన్న ఆలోచన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు ఆరుపదుల వయసులో వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? అవును ఆయన ఆ వయసులోనే సినిమా తీసి సక్సెస్ అయ్యారు. అలా హిట్ అయిన ఆదిత్య 369 మూవీ వచ్చే నెల 4వ తేదీన రీ రిలీజ్ కానుంది.
సీక్వెల్ ను రెడీ చేసి...
ఆదిత్య 369 మూవీ తీసిన సమయంలో బాలకృష్ణ వయసు 30 సంవత్సరాలు. అంటే మూడు దశాబ్దాలు గడిచినా ఆ సినిమాకు తీసిపోని మరో ఫాంటసీ మూవీ మరొకటి రాలేదనే చెప్పాలి. తక్కువ ఖర్చుతో నిర్మించిన ఈ మూవీ అన్ని విభాగాల్లో హిట్ కావడంతో రీ రిలీజ్ కు రెడీ అయిపోయింది. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆదిత్య 369 సీక్వెల్ ను త్వరలోనే సెట్ మీదకు వెళుతుందని బాలయ్య చెప్పారు. నిజంగా బాలకృష్ణ అభిమానులకు ఇది తీపికబురు. అయితే ఇందులో ఎవరెవరు నటిస్తారన్నది మాత్రం బాలయ్య రివీల్ చేయలేదు.


Tags:    

Similar News