ఆవిడకొద్దట… ఈయనది క్యాన్సిల్?

కోలీవుడ్ లో వరలక్ష్మి శరత్ కుమార్ – హీరో విశాల్ కి లవ్ ఎఫైర్ నడిచిన విషయం తెలిసిందే. చాలా రోజులు ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండా [more]

Update: 2019-08-23 05:42 GMT

కోలీవుడ్ లో వరలక్ష్మి శరత్ కుమార్ – హీరో విశాల్ కి లవ్ ఎఫైర్ నడిచిన విషయం తెలిసిందే. చాలా రోజులు ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండా బ్రేకప్ చేసుకున్నారు. అయితే కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న విశాల్.. అనిశా ని లవ్ చేస్తున్నాడంటూ ప్రచారం మొదలవడం…. అదే ఊపులో హైదరాబాద్ లో విశాల్ – అనిశా ల ఎంగేజ్మెంట్ జరగడం.. కొన్ని నెలల తర్వాత పెళ్లి అంటూ ప్రకటన రావడం జరిగాయి. ఇక విశాల్ సినిమాల్లో, నడిగర్ సంగం ఎన్నికల విషయంలో బాగా బిజీ అయ్యాడు. అయితే తాజాగా ఓ పదిరోజుల క్రితం వలక్ష్మి శరత్ కుమార్ తనింక లైఫ్ లో పెళ్లి చేసుకోనని చెప్పి అందరికి షాకిచ్చింది.

ఇక తాజాగా విశాల్ – అనిశా ల ప్రేమ, పెళ్లి కూడా బ్రేకప్ అయినట్లుగా మీడియా టాక్. విశాల్ తనని అనిశా చాలా ప్రేమిస్తుందని.. దేవుడే తనకి తోడుగా అనిశాని పంపాడని చాలా సందర్భాల్లో చాలా సార్లు చెప్పాడు. ఇక మరికొద్ది రోజుల్లో విశాల్ – అనిశా ల పెళ్లి మాట వింటామనుకుంటే…. సడన్ గా ఇలా విశాల్ – అనీషా ల ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినట్లుగా చెబుతున్నారు. అయితే ఇలాంటి వార్తలు రావడానికి కారణం.. సోషల్ మీడియాలో అనిశా… విశాల్ ఫొటోస్ ని డిలేట్ చెయ్యడమే అంటున్నారు. విశాల్ కి అనిశా కి గత కొంతకాలంగా మనస్పర్థలు నడుస్తున్నాయని.. ఆ విభేదాల కారణంగానే వీరిద్దరికి బ్రేకప్ అయ్యిందనే న్యూస్ నడుస్తుంది. మరి ఇద్దరు ప్రేమికుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి వద్దంటుంటే.. విశాల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవడం ఇప్పుడుబ్రేకింగ్ న్యూస్ అయ్యింది.

Tags:    

Similar News