ఈ విషయంలో వాళ్ళు షేమ్ షేమ్!!

ప్రపంచం మొత్తం కరోనా తో అల్లాడిపోతోంది. కరోనా కరతాళ నృత్యంతో అగ్ర దేశాలే ఒణికి పోతున్నాయి. కరోనా కల్లోనానికి అగ్రతారలంతా తమ వంతు సహాయం చేస్తున్నారు. టాలీవుడ్ [more]

Update: 2020-04-01 06:22 GMT

ప్రపంచం మొత్తం కరోనా తో అల్లాడిపోతోంది. కరోనా కరతాళ నృత్యంతో అగ్ర దేశాలే ఒణికి పోతున్నాయి. కరోనా కల్లోనానికి అగ్రతారలంతా తమ వంతు సహాయం చేస్తున్నారు. టాలీవుడ్ లో అయితే యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు, దర్శకనిర్మాతలు, నిర్మాణ సంస్థలు అంతా కరోనా కల్లోలానికి తమ వంతు విరాళాలిస్తున్నారు. ప్రభస్ అయితే ఏకంగా 4 కోట్ల విరాళం ఇవ్వగా,.. బాలీవడ్ హీరోలైన అక్షయ్ కుమర్ 25 కోట్ల విరాళం ఇచ్చాడు. ఇక సల్మాన్ ఖాన్ అయితే 25 వేలమందికి సహాయం చేస్తున్నాడు. అందరూ ఎవరికీ తోచింది వారు విరాళాలుగా ఇస్తున్నారు. చిన్న హీరోలు పెద్ద హీరోలు, చివరికి కమేడియన్స్ , కేరెక్టర్ ఆర్టిస్ట్ లు ఎవరు బడితే వారే కరోనా ని పారద్రోలడానికి సహాయం చేస్తుంటే.. కోట్లలో పారితోషకాలు అందుకునే హీరోయిన్స్ మాత్రం ఒక్క రూపాయి ఇవ్వడం లేదు.

ఫామ్ లో దూసుకుపోతున్న హీరోయిన్స్ భారీగా పారితోషకాలు అందుకోవడమే కానీ.. ఒక్కరూ ముందుకొచ్చి నా విరాళం ఇంత అని ఇచ్చిన పాపాన లేదు. చిన్న హీరోయిన్ ఫెడవుట్ హీరోయిన్ ప్రణీత సుభాష్ లక్ష విరాళం ఇచ్చింది. ఆమెకి అదే ఎక్కువ. అయినా ఇచ్చింది. కానీ రెండు కోట్లు, కోటి, లక్షల్లో పారితోషకాలు వెనకేసుకునే హీరోయిన్స్ మాత్రం ఒక్క రూపాయి తియ్యడం లేదు. అసలు కరోనా వచ్చి ప్రాణం పొతే… వెనకేసుకున్న సొమ్ము అంతా వేస్ట్. అయినా హీరోయిన్స్ కి ఆ విషయం అర్ధమవడం లేదు. నిజంగా హీరోలు ఇప్పుడు కరోనా విరాళాలతో రియల్ హీరోలైతే… అందమైన హీరోయిన్స్ మాత్రం దెయ్యాల్లాగా కనబడుతున్నారు. అందం, గ్లామర్ ఉంటే సరిపోదు…. అందమైన మనసుండాలిగా అంటూ హీరోయిన్స్ ఫాన్స్ కూడా హీరోయిన్స్ ని చూసి షేమ్ షేమ్ అంటున్నారు.

Tags:    

Similar News